ఇద్దరికి సమ్మతమే | Sammathame Movie Opening | Sakshi
Sakshi News home page

ఇద్దరికి సమ్మతమే

Jan 11 2021 5:37 AM | Updated on Jan 11 2021 5:37 AM

Sammathame Movie Opening - Sakshi

కిరణ్‌ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించనున్న చిత్రం ‘సమ్మతమే’. గోపీనా«ద్‌ రెడ్డి దర్శకత్వంలో యు.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.ప్రవీణ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన సన్నివేశానికి కూనుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, భువనగిరి ఎం.ఎల్‌.ఏ పైలా శేఖర్‌రెడ్డి క్లాప్‌కొట్టారు. గోపీనా««ద్‌రెడ్డి మాట్లాడుతూ–‘‘ ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈరోజు నుంచే మొదలుపెడుతున్నాం. మార్చిలో షూటింగ్‌ కంప్లీట్‌ చేయాలని ప్లాన్‌ చేసుకున్నాం’’ అన్నారు.

‘‘టైటిల్‌ తగ్గట్టే సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు మంచి చిత్రం అందించాలనే ఈ సినిమా నిర్మిస్తున్నా’’ అన్నారు కె.ప్రవీణ. కిరణ్‌ మాట్లాడుతూ–‘‘ ఈ సినిమా కోసం మూడేళ్లుగా వర్క్‌ చేస్తున్నాం. మా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాత్రి, పగలు కష్టపడి రెడీ చేసుకున్నాం. వరుస సినిమాలతో డే అండ్‌ నైట్‌ వర్క్‌ దొరకటం హ్యాపీగా ఉంది. చాందినీ, నేను ఇద్దరం షార్ట్‌ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుండి వచ్చిన వాళ్లమే’’ అన్నారు. చాందినీ మాట్లాడుతూ–‘‘ ‘కలర్‌ఫోటో’ తర్వాత లుక్‌ అండ్‌ క్యారెక్టర్‌ పరంగా డిఫరెంట్‌గా ఉండే పాత్ర కావాలని ఎదురుచూశాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం– శేఖర్‌ చంద్ర.

Advertisement
 
Advertisement
Advertisement