‘శాకుంతలం’ అప్‌డేట్స్‌ : సెట్స్‌పైకి ఎప్పుడంటే..

Samanthas Shakuntalam Goes On Floors From June Ending - Sakshi

నెలాఖరులో సెట్స్‌కి...
కథానాయిక సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. సమంత కెరీర్‌లో తొలిసారిగా చేస్తున్న ఈ మైథాలాజికల్‌ మూవీని ప్రముఖ దర్శకులు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శాకుంతల పాత్రధారిగా సమంత, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు కోవిడ్‌ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ చిత్రం షూటింగ్‌ని జరిపారు. లాక్‌డౌన్‌తో బ్రేక్‌ వేయక తప్పలేదు. అయితే ఈ నెలాఖరున ‘శాకుంతలం’ చిత్రీకరణను మళ్లీ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో ఈ చిత్రీకరణ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ యాభై శాతం పూర్తయింది. ఈ కొత్త  షెడ్యూల్‌లో సమంత, దేవ్‌మోహన్‌లకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ‘దిల్‌’ రాజుతో కలసి గుణ శేఖర్‌ తనయ నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top