
Samantha Akkineni Visits Tirupati: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత అక్కినేని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్న సమంతను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కాగా సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో కాత్తు వాక్కుల రెండు కాదల్ మూవీలో ఆమె నటిస్తున్నారు. దర్శకుడు విఘ్నేశ్ శివన్ తెరకెక్కితున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి, నయన తారలు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనితో పాటు సామ్ ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సంతకం చేసినట్టు వినికిడి.