Ram Charan Birthday: చరణ్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha Special Birthday Wishes To Ram Charan On His Birthday - Sakshi

Samantha Special Birthday Wishes To Ram Charan: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా నడుస్తోంది. ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల నటనకు ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. ఇక జక్కన కథను మలిచిన తీరుకు ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రెటీలు సైతం హ్యాట్సాప్‌ చెబుతున్నారు. మార్చి 25న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టిస్తుంది. రికార్టు స్థాయిలో కలెక్షన్స్‌ రాబుడుతుంది. ఇదిలా ఉంటే నేడు(మార్చి 27) రామ్‌ చరణ్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా సినీ సెలబ్రెటీల నుంచి చెర్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

చదవండి: పుష్ప-2లో సమంత!.. మరి రష్మిక మందన్నా?

ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో చెర్రి.. అల్లూరి సీతారామరాజు పాత్రపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో అద్భుతంగా నటించాడంటూ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రను కీర్తిస్తున్నారు. దీంతో సోషల్‌ మీడియా మొత్తం రామ్‌ చరణ్‌ పేరు మార్మోగిపోతోంది. ఈ క్రమంతో స్టార్‌ హీరోయిన్‌ సమంత సైతం చరణ్‌కు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ఈ మేరకు సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు లుక్‌ను షేర్‌ చేసింది. ‘నా ఫేవరేట్ హీరో రామ్ చరణ్‌కు స్పెషల్ హ్యాపీ బర్త్ డే. ఆర్ఆర్ఆర్ మూవీపై వస్తున్న ప్రశంసలు విన్నాను.

చదవండి: 'మీటూ' తెలియదు.. కానీ 10 మంది మహిళలతో పడక పంచుకున్నా: నటుడు

అలాగే నీ అద్భుతమైన నటనకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తున్నా. దీంతో సినిమాను ఎప్పుడెప్పుడూ చూస్తానా? అని చాలా ఆత్రుతగా ఉన్నాను. ఈ ప్రశంసలన్నింటికి నువ్వు అర్హుడివి. ఇకపై కూడా ఇలాగే మరెన్నో విజయాలు అందుకుంటావు.. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్’ అంటూ రాసుకొచ్చింది. కాగా సమంత, చరణ్‌ కలిసి రంగస్థలం మూవీలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే సమంతతో పాటు చరణ్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం, ఆయన తండ్రి, మెగాస్టార్‌ చిరంజీవి, జక్కన్న, ఎన్టీఆర్, భార్య ఉపాసన ఇలా ఎంతో మంది విషెస్‌ తెలిపారు. తారక్‌ అయితే ఏకంగా చరణ్‌ బర్త్‌డే పార్టీని తన ఇంటిలో హోస్ట్‌ చేశాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top