అప్పుడే ఓటీటీలో శాకుంతలం మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడ? ఎప్పుడంటే.. | Samantha Shaakuntalam OTT Release Date When And Where To Watch | Sakshi
Sakshi News home page

Shaakuntalam OTT : ఆ ఓటీటీలోనే సమంత 'శాకుంతలం'!.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే....

Apr 15 2023 1:23 PM | Updated on Apr 15 2023 1:53 PM

Samantha Shaakuntalam OTT Release Date When And Where To Watch - Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం'. భారీ బడ్జెట్‌తో గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నీలిమ గుణ నిర్మించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఏప్రిల్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం  మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ అలరించగా భరతుడిగా అల్లు అర్హ నటించింది. మోహన్‌ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. రిలీజ్‌కు ముందు భారీ బజ్‌ క్రియేట్‌ అయినా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన మేర ఈ చిత్రం రాణించలేకపోయిందనే టాక్‌ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే శాకుంతలం ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్‌ అవుతుందనే చర్చ నడుస్తుంది.

సినీ వర్గాల సమచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. భారీ ధరకే ఓటీటీకి విక్రయించినట్లు తెలుస్తుంది. ‘శాకుంతలం’ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత అంటే మే మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement