నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే: సమంత | Samantha Says Her Ex Partner Constantly Influenced Her Likes And Dislikes, See Fans Reactions Inside - Sakshi
Sakshi News home page

Samantha Ruth Prabhu: జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.. మాజీ భర్తపై సమంత షాకింగ్ కామెంట్స్!

Published Thu, Jan 18 2024 2:41 PM

Samantha Says Her Ex Partner Constantly Influenced Her - Sakshi

సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా.. సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది స్టార్‌ హీరోయిన్‌ సమంత. తన ఇన్‌స్టా ఖాతాలో నిత్యం ఏదో ఒక పోస్ట్‌ పెడుతూనే ఉంటుంది.  ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో చిట్‌చాట్‌ చేస్తుంది. తాజాగా రెడ్డిట్ ద్వారా  ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. అలాగే తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటో కూడా చెప్పింది.  తన ఇష్టాయిష్టాలను గుర్తించడంతో విఫలమయ్యానని అదే తాను చేసిన పెద్ద తప్పు అని సమంత చెప్పుకొచ్చింది. 

‘నా ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసుకునేందుకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే గతంలో నా జీవిత భాగస్వామి వాటిని ప్రభావితం చేశాడు.  క్లిష్ట సమయం నుంచి విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైన తర్వాతే నా వ్యక్తిగత ఎదుగుదల మొదలైంది’అని సమంత చెప్పుకొచ్చింది.  గతంలో ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. నాగ చైతన్యతో విడాకుల తర్వాత వరుస ఫ్లాపులు రావడం.. ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో మానసికంగా చాలా కుంగిపోయానని సామ్‌ చెప్పింది. 

కాగా,  2017లో నాగ చైతన్య, సమంతలు ప్రేమ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట.. 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కెరీర్‌ పరంగా బిజీ అయ్యారు. అయితే సమంతకు అనారోగ్య సమస్యలు రావడంతో.. సినిమాకు విరామం ప్రకటించింది. ప్రస్తుతం తన పూర్తి సమయం వ్యక్తిగత జీవితానికే కేటాయించింది.  ఇటీవల ఆమె నిర్మాతగాను మారింది.  ‘ట్రలాలా మూవీ పిక్చర్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకే ఈ వేదిక నిర్మించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement