'అన్ని చెడులకు అదే కారణం'.. రిలేషన్స్‌పై సమంత కామెంట్స్ | Samantha Ruth Prabhu shared her perspective on her ex Relations | Sakshi
Sakshi News home page

Samantha: 'అన్ని చెడులకు అదే కారణం'.. రిలేషన్స్‌పై సమంత కామెంట్స్

Published Wed, Feb 5 2025 7:19 PM | Last Updated on Wed, Feb 5 2025 9:42 PM

Samantha Ruth Prabhu shared her perspective on her ex Relations

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. గతేడాది సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సామ్ ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్‌లోనూ నటించండ లేదు. మరోవైపు పికిల్ బాల్ టోర్నమెంట్‌లో బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ సమంత అతనితో రిలేషన్‌లో ఉందంటూ కామెంట్స్ చేశారు. దీంతో నెట్టింట మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిలేషన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో ఉన్న సంబంధాలపై మాట్లాడింది. ఈ సందర్బంగా జీవితంలో చాలా కష్టాలు పడ్డానని తెలిపింది సామ్. అందుకే ప్రస్తుతం రిలేషన్ గురించి ఆలోచించట్లేదని వెల్లడించింది. అంతే కాకుండా గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్న వారిపట్ల తనకేలాంటి అసూయ, కోపం ఉండవని తెలిపింది. ఎందుకంటే అసూయ అన్నీ చెడులకు కారణమని చెబుతోంది సమంత.

కాగా.. గతంలో టాలీవుడ్ నాగచైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2017లో వివాహం చేసుకున్న చైతూ- సామ్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే ఉంటున్నారు.

నాగచైతన్య రెండో పెళ్లి..

నాగచైతన్య గతేడాది రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్‌ శోభిత ధూళిపాలను ఆయన పెళ్లాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement