Samantha Cars And Bags Collections: బర్త్‌డే గర్ల్‌ సమంత వద్ద ఉన్న ఈ కాస్ట్‌లీ వస్తువులు తెలుసా ?

Samantha Luxurious Cars Bags Collection On Her Birthday Special - Sakshi

Samantha Luxury Cars Bags Collection On Her Birthday Special: అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కు ఎదిగింది యాపిల్ బ్యూటీ సమంత. తన నటన, గ్లామర్, ఫ్యాషన్‌, ఫిట్‌నెస్‌తో ప్రేక్షకులు, అభిమానులకు బోర్‌ కొట్టించకుండా ఎప్పుడూ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. టాలీవుడ్‌ గుడ్‌ బాయ్‌ నాగ చైతన్యతో విడాకుల అనంతరం తన కెరీర్‌పై మరింత ఫోకస్‌ పెడుతూ దూసుకుపోతోంది. ఐటమ్ సాంగ్‌ నుంచి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన మార్క్ చూపిస్తుంది. సినిమాలే కాకుండా ఫ్యాషన్‌లోనూ సత్తా చాటుతోంది సామ్‌. నేడు (ఏప్రిల్ 28) పుట్టిన రోజు సందర్బంగా సామ్‌ దగ్గర ఉన్న లగ్జరీ కార్లు, కాస్ట్లీ బ్యాగులు ఇతర వస్తువులపై ఓ లుక్కేద్దామా !

సమంత వద్ద 6 లగ్జరీ కార్లు ఉ‍న్నట్లు సమాచారం. వాటిలో రూ. 2.55 కోట్ల విలువ చేసే మెర్సిడేజ్‌ బెంజ్‌ జీ63, రూ. 2.26 కోట్ల రేంజ్‌ రోవర్‌, రూ. 1.46 కోట్ల స్వాంకీ పోర్చే కేమన్‌, రూ. 1.42 కోట్ల బీఎండబ్ల్యూ 7 సిరీస్‌, రూ. 83 లక్షల ఆడి క్యూ 7, రూ. 72 లక్షల జాగ్వర్‌ ఎక్స్‌ఎఫ్‌ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సామ్‌కు హ్యాండ్‌బ్యాగ్‌లపై ఆసక్తి ఎక్కువే. సామ్‌ వద్ద వైఎస్‌ఎల్‌ లవ్ బాక్‌ క్లచ్‌ బ్యాగ్‌, బట్టేగా వెనెటా పంచ్‌ స్లింగ్‌ బ్యాగ్, ప్రద వింటేజ్‌ బ్యాగ్‌, లూయిస్ వుయిట్టన్‌ బ్లీకర్‌ బ్యాగ్‌, లూయిస్‌ వియుట్టన్‌ ట్విస్ట్‌ బ్యాగ్‌ వంటి తదితర లగ్జరీ బ్యాగులు ఉండటం విశేషం. వీటి ధర ఏకంగా రూ. 1.40 లక్షలు ఉంటుందని అంచనా. వీటితోపాటు సామ్ వాడే మనోలో బ్లాక్ హై హీల్స్‌ ఒక ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌. వీటి ధర సుమారు రూ. లక్ష ఉంటుందని టాక్. అయితే తాను ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కష్టముందని ఇదవరకు అనేకసార్లు సామ్‌ చెప్పిన విషయం తెలిసిందే. 

చదవండి: బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌: ఎదురుచూపుల్లో సమంత!

చదవండి: సమంత, నయనతార మధ్య నలిగిన హీరో.. ఆసక్తిగా ట్రైలర్‌

ఇదిలా ఉంటే 2010లో వచ్చిన 'ఏ మాయ చేశావే' సినిమాతో వెండితెరకు తెరంగేట్రం చేసిన సామ్‌ తన క్యూట్‌ అండ్‌ లవ్‌లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో సినీ లోకాన్ని మాయ చేసింది. తాజాగా కణ్మనీ రాంబో ఖతీజా (కాతువాక్కుల రెండు కాదల్‌) సినిమాతో తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం (ఏప్రిల్‌ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి, సామ్, నయన తార కలిసి నటించిన ఈ చిత్రానికి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. 

చదవండి: ఆ గాయం తగ్గడానికి ఆరు నెలలు పట్టింది : సమంత
పచ్చబొట్టు వేసుకోవాలన్న ఆలోచనే వద్దంటున్న సమంత

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top