Samantha Birthday: Shakuntalam Movie Team Released New Poster - Sakshi
Sakshi News home page

HBD Samantha: సమంత్‌ బర్త్‌డే సందర్భంగా శాకుంతలం నుంచి కొత్త పోస్టర్‌ రిలీజ్‌

Apr 28 2022 10:48 AM | Updated on Apr 28 2022 11:20 AM

Shakuntala Poster Released From Shakuntalam Movie By Gunasekhar - Sakshi

బర్త్‌డేను పురస్కరించుకుని శాకుంతలం చిత్రయూనిట్‌ స్పెషల్‌ పోస్టర్‌ను వదిలింది. ఇందులో శకుంతలగా కనిపించిన సామ్‌ ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లుగా ఉంది. ఇదిలా ఉంటే శాకుంతలం మైథలాజికల్‌ ఫిల్మ్‌ కావడంతో శకుంతల పాత్ర డైలాగ్స్‌ గ్రాంథికంలో ఉంటాయి.

సమంత కథానాయికగా నటిస్తున్న తొలి పీరియాడికల్‌ చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దుష్యంతుడు–శాకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గురువారం (ఏప్రిల్‌ 28) సమంత బర్త్‌డేను పురస్కరించుకుని శాకుంతలం చిత్రయూనిట్‌ స్పెషల్‌ పోస్టర్‌ను వదిలింది. ఇందులో శకుంతలగా కనిపించిన సామ్‌ ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లుగా ఉంది.

ఇదిలా ఉంటే శాకుంతలం మైథలాజికల్‌ ఫిల్మ్‌ కావడంతో శకుంతల పాత్ర డైలాగ్స్‌ గ్రాంథికంలో ఉంటాయి. అందుకని దాదాపు మూడు నెలలపాటు శిక్షణ తీసుకున్న అనంతరం డబ్బింగ్‌ పూర్తి చేసిందట సామ్‌. గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. మరోవైపు సమంత నటించిన మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ యశోద. సామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. మే 5న ఉదయం 11.07 గంటలకు యశోద ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించింది.

చదవండి: నువ్వు యాక్టరేంటి? నిన్ను తీసుకుంటే సమయం, డబ్బులు వృథా'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement