Samantha: అది మీకు ఎప్పటికీ తెలియదు.. దయతో మెలగండి, సామ్‌ పోస్ట్‌ వైరల్‌

Samantha Latest Instagram Post Goes Viral - Sakshi

మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు సమంత. మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధి సోకినా.. ధైర్యంగా నిలబడి ఎదుర్కొంది. నారోగ్యంతో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన సామ్‌.. ఇప్పుడు వరుస సినిమాలతో  ఫుల్‌ బిజీ అయింది. ప్రస్తుతం రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ను సెట్స్‌ మీదకు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్‌దేవరకొండ ‘ఖుషీ’ చిత్రంలోనూ సామ్‌ నటించనుంది.

ఇలా వరుస షూటింగ్స్‌తో బిజీ అయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా మోటివేషన్‌ కొటేషన్స్‌ షేర్‌ చేస్తూ.. అభిమానుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది. తాజాగా సామ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టింది. అందులో ఇలా రాసుకొచ్చింది.‘ఎదుటి వాళ్లు ఎంతగా కష్టపడుతున్నారు.. జీవితంలో ఎంత పోరాడుతున్నారు.. అనేది మీకు ఎప్పటికీ తెలియదు.. అందుకే కాస్త దయతో మెలగండి’అని సామ్‌ చెప్పుకొచ్చింది. సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top