Trolls On Kajal Aggarwal: కాజల్‌ బాడీపై ట్రోల్స్‌.. మద్దుతుగా నిలిచిన సమంత, లక్ష్మి మంచు

Samantha, Lakshmi Manchu Supports Kajal Aggarwal Over Her Body Shaming Trolls - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల తన శరీరంలో వచ్చిన మార్పులతో బాడీ షేమింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్‌ 7నెలల గర్భవతి. ఈ నేపథ్యంలో తన సోదరి నిషా అగర్వాల్‌ తనయుడితో ఓ ప్రకటనలో నటించింది. ఇందులో కాజల్‌ బేబీ బంప్‌తో బోద్దుగా కనిపించింది. అయితే ఆడవాళ్లలో గర్భవతి సమయంలో వచ్చే సహజ మార్పులే కాజల్‌లో కూడా కనిపించాయి. అయితే తను హీరోయిన్‌ కావడంతో ఈ మార్పుల కారణంగా ఆమె విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

చదవండి: ఓటీటీకి రౌడీ బాయ్స్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌!, ఎక్కడంటే..

కానీ కాజల్‌ మాత్రం వాటిని చూసి వదిలేయలేదు. తనపై అసభ్య కామెంట్స్‌ చేసిన నెటిజన్లకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘నా జీవితంలో, నా శరీరంలో, ఇంట్లో, పని ప్రదేశంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి, వాటన్నింటినీ ఎంజాయ్‌ చేస్తున్నా. ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్‌ కామెంట్లు, మీమ్స్‌ వల్ల  నాకెలాంటి ఉపయోగం లేదు. కష్టంగా అనిపించినా సరే కానీ ముందు దయతో ఎలా మెదలాలో నేర్చుకోండి. మీరు బతకండి, ఇతరులనూ బతకనివ్వండి’ అంటూ ట్రోలర్స్‌కు గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. 

చదవండి: Sudheer Babu: కెమెరామెన్‌ అలా అనడంతో గదిలోకి వెళ్లి ఏడ్చాను

ఈ క్రమంలో కాజల్‌ పోస్ట్‌పై స్పందించిన టాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు.‘నువ్వు అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ అందంగానే ఉన్నావ్‌’ సమంత కామెంట్స్‌ చేయగా.. నువ్వు ప్రతి దశలో పర్‌ఫెక్ట్‌, నీ చూట్టు చాలా ప్రేమ ఉంది బేబీ’ అని మంచు లక్ష్మీ కామెంట్‌ చేసింది. అలాగే రాశి ఖన్నా సైతం కాజల్‌కు మద్దతునిస్తూ తన పోస్టుపై స్పందించింది. వీరి కామెంట్స్‌పై కాజల్‌ సోదరి నిషా అగర్వాల్‌ స్పందిస్తూ.. ‘నిజమే.. ఇంతకంటే మాటల్లో చెప్పలేం! నా గార్జియస్‌’ అంటూ రిప్లై ఇచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top