Sudheer Babu: కెమెరామెన్‌ అలా అనడంతో గదిలోకి వెళ్లి ఏడ్చాను

Sudheer Babu Special Interview For Completion Of 10 Years In Industry - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు బావ, హీరో సుధీర్‌ బాబు సినీ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు గడిచాయి. 2012లో వచ్చిన ‘శివ మనసులో శృతి’ సినిమాతో సుధీర్‌ బాబు టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. 2012 ఫిబ్రవరి 10న విడుదలైన శివ మనసులో శ్రుతి మూవీలో హీరోగా నటిస్తూనే ఆ సినిమాను నిర్మించాడు సుధీర్‌ బాబు. అయితే ఈ సినిమా కలెక్షన్స్‌ పరంగా నిరాశ పరిచిన సుధీర్‌ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ మూవీ వచ్చి నేటికి 10 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.  

చదవండి: సమంత సరసన క్రికెటర్‌ శ్రీశాంత్‌!, ఏ మూవీలో తెలుసా?

ఈ మేరకు సుధీర్‌ బాబు మాట్లాడుతూ.. పదేళ్ల తన సినీ కెరీర్‌ సంతృప్తి నిచ్చిందన్నాడు. ‘నేను సినిమాలు, వాటి సంఖ్య కంటే కూడా నటుడిగా నాకు నేను సంపాదించుకున్న గౌరవమే ముఖ్యం. వెనక్కి తిరిగి చూసుకుంటే నటుడిగా వందశాతం కష్టపడ్డాను. ఆ సంతృప్తి నాకు ఉంది చాలు. కెరీర్‌లో నేను చూసిన వైఫల్యాలు, విజయాలు నాకు మంచి పాఠాలు.  స్క్రిప్ట్‌లను ఎలా ఎంచుకోవాలో నేర్చుకున్నాను. కథతో పాటు బడ్జెట్‌, టెక్నికల్ టీమ్‌ని కూడా పరిగణనలోకి తీసుకోవాలనే విషయాన్ని గ్ర‌హించాను. పరిశ్రమలో ఎన్నేళ్లు ఉంటానని లెక్కలేసుకుని రాలేదు. నటుడిని కావాలనే తపనతో వచ్చాను. నాకు యాక్ష‌న్ సినిమాలంటే ఇష్టం’ అని అన్నాడు. ఇక తన తొలి సినిమా షూటింగ్‌ సమయంలో ఓ చేదు అనుభవం ఎదురైందని ఈ సందర్భంగా సుధీర్‌ బాబు గుర్తు చేసుకున్నాడు.

చదవండి: శంకర్‌ పిలిచి ఆఫర్‌ ఇస్తే ఆ హీరో నో చెప్పాడట, ఆ తర్వాత చూస్తే బ్లాక్‌బస్టర్‌ హిట్‌

‘తొలి సినిమా షూటింగ్‌ మొదటి రోజే కెమెరా మెన్‌ నా అసిస్టెంట్‌త ఓ మాట అనడం విన్నాను. ‘‘ఇది వర్కౌట్‌ కాదు. హీరోది ఫోటోజెనిక్‌ ఫేస్‌ కాదని, నేను పరిశ్రమలో నిలదొక్కుకోవడం కష్టం’’ అని అన్నాడు. దీంతో గదిలోకి వెళ్లి నాన్‌స్టాప్‌గా ఏడ్చాను. ఎందుకంటే ఆ సినిమాకు నేనే నిర్మాతను. 60 లక్షల రూపాయలు అప్పు తీసుకుని మరి అప్పటికే అందరికి అడ్వాన్స్‌ ఇచ్చేశాను. కాబట్టి వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. నా పర్ఫామెన్స్‌తోనే ఇలాంటి కామెంట్స్‌కు సమాధానం ఇవ్వాలనుకున్నా. అతడి వ్యాఖ్యలు నన్ను బాధించినప్పటికీ.. అవి నాకు పాఠంగా నిలిచాయి. అతడి మాటలతో నటుడిగా నన్ను ప్రూవ్‌ చేసుకోలవాలనే తపన నాలో పెరిగింది’ అని చెప్పుకొచ్చాడు. 

చదవండి: ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘బంగార్రాజు’!, ఎక్కడంటే..

 ఆ తర్వాత హీరోగా కొత్త జోనర్‌లను ప్రయత్నించాలనే ఉద్దేశంతో ‘ప్రేమ కథా చిత్రం, సమ్మోహనం, చేశానన్నాడు. అలాగే నటుడిగా నిరుపించుకునేందుకు హిందీలో బాఘీ ఆఫర్‌ వస్తే చేశానని, ఇప్పుడు బ్రహ్మస్త్రలో విలన్‌గా నటించినట్లు తెలిపాడు. సినిమా, స్క్రిప్ట్‌ విషయంలో ఎప్పుడైన మహేశ్‌ బాబు సాయం తీసుకున్నారా? అని అడగ్గా..  ఈ పదేళ్లలో తానేప్పుడు మహేశ్‌ను ఏ సాయం కోరలేదని చెప్పాడు. అది తను పాటిస్తున్న సూత్రమని, దర్శకనిర్మాతలు తన ప్రతిభను గౌరవిస్తున్నారు. అదే కారణంతో ఆఫర్లు వస్తున్నాయని పేర్కొన్నాడు. ఇక మంచి కథ దొరికితే మహేశ్‌తో నటించాలనేది తన కోరిక అని సుధీర్ బాబు తెలిపాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top