సమంత వద్ద జాబ్‌ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి | Samantha Hiring Jobs Her Saaki | Sakshi
Sakshi News home page

సమంత వద్ద జాబ్‌ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి

May 11 2024 7:12 AM | Updated on May 11 2024 11:00 AM

Samantha Hiring Jobs Her Saaki

సౌత్‌ ఇండియా టాప్‌ హీరోయిన్‌ సమంతలో అందం, అభినయంతో పాటు మంచితనం కనిపిస్తుంటుంది. ఈ గుణాలు అన్నీ ఆమెలో ఉన్నాయి కాబట్టే సమంతను అభిమానులకు మరింత చేరువ చేసింది. ఇప్పటికే సామ్‌ నటిగా పలు సంస్థలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం ఆమె స్వయంగా 'సాకి' అనే దుస్తుల బ్రాండ్‌ను స్థాపించిన విసయం తెలిసిందే. తన బ్రాండ్‌కు చెందిన డిజైనర్‌ దుస్తులు మార్కెట్‌లో భారీగా ట్రెండ్‌ అవుతున్నాయి. సాకి బ్రాండ్‌ అంటే సమంతకు చాలా ఇష్టం. అందులో తనకు ఫ్యాషన్‌పై ఉన్న అభిరుచిని తెలుపుతుంది.

అయితే, సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ చేసింది. తనకు ఎంతో ఇష్టమైన 'సాకి'లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది. అందుకు సరిపడా అర్హతలు ఉన్నవారు సంప్రదించవచ్చని ఒక మెయిల్‌ అడ్రస్‌ను కూడా పొందుపరిచింది. తన కంపెనీలో ఉన్న ఉద్యోగ వివరాలను కూడా తెలిపింది. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ వంటి ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపింది. ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారందరూ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చని తెలిపింది.

సమంత ఏకమ్‌ ఎర్లీ లెర్నింగ్‌ సెంటర్‌ పేరుతో పిల్లల కోసం ప్లే స్కూల్‌ కూడా నడుపుతుంది. తమ పిల్లలను అందులో చేర్పించేందుకు కావాల్సిన వివరాలు తెలుసుకునేందుకు ఒక ఫోన్‌ నంబర్‌ను (9154900466) కూడా ఆమె షేర్‌ చేసింది. మరోవైపు సూపర్‌ ఫుడ్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టిన సమంత.. ఏడాదికి మూడు మిలియన్‌ డాలర్లు ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే సమంత స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement