breaking news
saaki
-
సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా ?..ఇలా సంప్రదించండి
-
సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ సమంతలో అందం, అభినయంతో పాటు మంచితనం కనిపిస్తుంటుంది. ఈ గుణాలు అన్నీ ఆమెలో ఉన్నాయి కాబట్టే సమంతను అభిమానులకు మరింత చేరువ చేసింది. ఇప్పటికే సామ్ నటిగా పలు సంస్థలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం ఆమె స్వయంగా 'సాకి' అనే దుస్తుల బ్రాండ్‌ను స్థాపించిన విసయం తెలిసిందే. తన బ్రాండ్‌కు చెందిన డిజైనర్ దుస్తులు మార్కెట్లో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. సాకి బ్రాండ్ అంటే సమంతకు చాలా ఇష్టం. అందులో తనకు ఫ్యాషన్‌పై ఉన్న అభిరుచిని తెలుపుతుంది.అయితే, సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసింది. తనకు ఎంతో ఇష్టమైన 'సాకి'లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది. అందుకు సరిపడా అర్హతలు ఉన్నవారు సంప్రదించవచ్చని ఒక మెయిల్ అడ్రస్‌ను కూడా పొందుపరిచింది. తన కంపెనీలో ఉన్న ఉద్యోగ వివరాలను కూడా తెలిపింది. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ వంటి ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపింది. ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారందరూ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చని తెలిపింది.సమంత ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ పేరుతో పిల్లల కోసం ప్లే స్కూల్ కూడా నడుపుతుంది. తమ పిల్లలను అందులో చేర్పించేందుకు కావాల్సిన వివరాలు తెలుసుకునేందుకు ఒక ఫోన్ నంబర్‌ను (9154900466) కూడా ఆమె షేర్ చేసింది. మరోవైపు సూపర్ ఫుడ్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన సమంత.. ఏడాదికి మూడు మిలియన్ డాలర్లు ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే సమంత స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
అద్దం ముందు సమంత చేసిన వీడియో వైరల్
ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు క్లోతింగ్ బిజినెస్‌లోనూ సమంత ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'సాకి' పేరుతో లాంఛ్ అయిన ఈ క్లోతింగ్ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఈ దుస్తులను ప్రపంచవ్యాప్తంగా అమ్మేందుకు సిద్ధమైంది. 'సాకి' ఆన్లైన్ స్టోర్‌కు విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయిని, దీంతో అమెరికా, సింగపూర్, మలేషియా దేశాలకు వీటిని షిప్పింగ్ చేస్తున్నట్లు సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. దీనికి సంబంధించిన ప్రమోషన్‌ను ఎప్పటిలాగే కొత్తగా ఆవిష్కరించింది. 'సాకి' బ్రాండ్‌కు చెందిన దుస్తులను అద్దం ముందు నిలబడి ఒక్కొక్కటిగా మార్చుకుంటూ కెమెరాకు ఫోజిచ్చింది. 'ఇన్‌స్టా' రీల్‌తో మరింత అందంగా రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఈ వీడియోకు 10 లక్షలకు పైగానే లైక్స్ వచ్చాయి. 'సమంత ఏం చేసినా కొత్తగానే ఉంటుంది..సూపర్భ్ సామ్' అంటూ పలువురు నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ ఇటీవలె గ్రాండ్‌గా లాంఛ్ అయింది.ఇందులో టైటిల్ రోల్ సమంత పోషిస్తుండగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ కనిపించనున్నారు. 2022లో ఈ సినిమా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) చదవండి :వైరల్: అద్భుతమైన డ్యాన్స్‌తో అదరగొడుతున్న సమంత ఈ సారి సాయి పల్లవి కాదు మంగ్లీ స్టెప్పులేసింది! -
హవ్వ.. ఇదేం ట్రాక్!
‘సాకి’లో నీటి ప్రవాహానికి అడ్డంగా నిర్మాణం చెరువు ఉనికికే ప్రమాదం జీహెచ్ఎంసీ అధికారుల చోద్యం పటాన్చెరు:లీడర్స్ డెరైక్షన్, అధికారుల యాక్షన్‌తో చెరువులను కాపాడాల్సిన పాలకులు చెరువు ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. చెరు వు కింద ఆయక ట్టే లేదు. రైతులు లేరు ఇక చెరువు ఎందుకన్న విధంగా పెద్దలు ప్రవర్తిస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొత్త వెంచ ర్లు వేసేందుకు ఉబలాట పడుతున్న వారికి జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు తోడ్పాటు నందిస్తుండటం గమనార్హం. కంచే చేను మేసిన విధంగా సాకి చెరువు పైభాగంలో ఇళ్ల నిర్మాణాలకే అనుమతులివ్వని జీహెచ్ఎంసీ ఇప్పు డు ఏకంగా వాకింగ్ ట్రాక్నే నిర్మిస్తున్నారు. సాకి చెరువులో నీటి ప్రవాహానికి అడ్డుగా వాకింగ్ ట్రాక్ నిర్మాణం సాగిస్తున్నారు. నిబంధనల మేరకు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదు. కాని జీహెచ్ఎంసీ అధికారులే దగ్గరుండి చెరువులో నీటి ప్రవాహానికి అడ్డుగా వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు మట్టి పోస్తున్నారు. సాకి చెరువుపై భాగంలో 30 ఏళ్ల క్రితం శాంతినగర్, శ్రీనగర్కాలనీలు వెలిశాయి. అప్పట్లో వెలసిన ఆ లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన చాలా మందికి జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు నేటికీ ఎఫ్టీఎల్ పేరుతో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. మట్టి పోస్తే జైలే.. సాకి చెరువు శివారులో తన పొలంలో స్థానిక రైతు టప్ప కుమార్ అనే వ్యక్తి మట్టితో నింపారు. ఆయనపై స్థానిక రెవెన్యూ అధికారులు కేసులు పెట్టి, జైలుకు తరలించారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం చెరువులోకి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డుగా శిఖం పరిధిలో మట్టి పోసి నిర్మాణాలు చేస్తున్నారు. దీని వెనుక స్థానిక లీడర్ల హస్తం ఉందని ఆరోపణలు వినవస్తున్నాయి. వాకింగ్ ట్రాక్ నిర్మిస్తే చెరువుకు హద్దు ఫిక్స్ చేసినట్టు అవుతుందని ఆ తరువాత ఎఫ్టీఎల్ పరిధిలో కొత్తగా వెంచర్ వేసి అమ్ముకోవాలని కొందరు ప్రణాళికలు వేస్తున్నారనే అనుమానాలున్నాయి. స్థానికుల అనుమానాలకు ఊతం ఇచ్చేలా జీహెచ్ఎంసీ అధికారుల సాకి చెరువు ఎఫ్టీఎల్, శిఖం భూమిలో నిర్మాణాలు చేయడం గమనార్హం. కంచే చేను మేసిన విధంగా చెరువును కాపాడాల్సిన అధికారులు చెరువు ఉనికికే ప్రమాదం తెచ్చే విధంగా నిర్మాణాలు సాగించడం విడ్డూరంగా ఉంది. సాకే చెరువు.. కొన్ని వందల ఏళ్ల క్రితం వెలసిన సాకి చెరువుకు అసలు పేరు సాకే చెరువని.. ప్రస్తుతం సాకి చెరువుగా రూపాంతరం చెందిందని చరిత్రకారుడు త్యార్ల మాణయ్య తన పుస్తకంలో లిఖించారు. రానురాను పటాన్చెరులో పంటలు వేయకపోవడంతో చెరువు అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. చెరువు అలుగు వద్దే కబ్జాలున్నాయి. వాటిని తొలగించాలని డిమాండ్ ఉంది. 98 ఎకరాల విస్తీర్ణంతో చెరువు శిఖం భూమి ఉంది. దాదాపు 10 ఎకరాల భూమి పరిధిలో కబ్జాలు గతంలోనే జరిగాయి. తాజాగా మరో పది ఎకరాల భూమిలో కొత్త వెంచర్ వేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. దాని విలువ దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. అడ్డేమి లేదు పట్టణ పరిధిలోని సాకి చెరువులో మట్టి నింపుతున్న జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ఆక్షేపణలు వ్యక్తం చేస్తూ పర్యావరణ ఉద్యమకారులు ఫిర్యాదు చేసినా జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఏ మాత్రం స్పందన లేదు. సాకి చెరువలో సాగుతున్న నిర్మాణంపై ‘సాక్షి’ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ విజయ్‌కుమార్ వివరణ కోరగా చెరువులో జరగుతున్న పనులతో తమకే సంబంధంలేదని అది జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం పరిధిలోకి వస్తాయని వారితో మాట్లాడాలని వివరణ ఇచ్చారు. ఇక ఆ లేక్స్ విభాగం పనులను, సాకి చెరువు నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించే ఏఈ శేషగిరిరావును వివరణ కోరేందుకు పలకరిస్తే తానేమి మాట్లాడలేనంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌తో వివరణ తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈ విషయమై ఫోన్లో జీహెచ్ఎంసీ ఈఈ (లేక్స్) శేఖర్‌రెడ్డి వివరణ కోరగా చెరువులో నిర్మాణాలేవీ నీటి ప్రవాహానికి అడ్డుగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టడంలేదని పేర్కొన్నారు. చెరువులో సుందరీకణ పనులు మాత్రమే చేస్తున్నామని చెప్పారు.