'స‌మంత విడాకులు తీసుకోవ‌చ్చు క‌దా!' | Samantha Funny Reply To Netizen For Asking Her Divorce | Sakshi
Sakshi News home page

విడాకులు తీసుకోమ‌ని స‌ల‌హా: సమంత‌ రిప్లై

Nov 5 2020 5:26 PM | Updated on Nov 5 2020 8:13 PM

Samantha Funny Reply To Netizen For Asking Her Divorce - Sakshi

చిరున‌వ్వుల‌కే కాదు, చిలిపిత‌నానికి కూడా స‌మంత కేరాఫ్ అడ్ర‌స్‌. సోష‌ల్ మీడియాలో త‌న అభిమానుల‌తో నిత్యం ట‌చ్‌లో ఉంటారు సామ్‌. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న లేటెస్ట్ ఫొటోల‌తో పాటు ఫిట్‌నెస్ వీడియోల‌ను పంచుకుంటారు. ఈ క్ర‌మంలో సామ్ నేడు "ఫీలింగ్ గుడ్" అంటూ చిరున‌వ్వులు చిందిస్తున్న ఫొటో‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి ఓ నెటిజ‌న్ స్పందిస్తూ.. 'మీరు  చైత‌న్య‌కు విడాకులు ఇవ్వొచ్చు క‌దా! మ‌నిద్ద‌రం పెళ్లి చేసుకుందాం' అని అప్లికేష‌న్ పెట్టుకున్నాడు. (చ‌ద‌వండి: ఇంటి బాధ్యత ఎప్పుడూ కోడలిదే!)

ఈ కామెంట్ కంట ప‌డ్డ సామ్ చ‌మ‌త్కారంగా రిప్లై ఇచ్చారు. "ఇది క‌ష్టం కానీ.. ఒక ప‌ని చెయ్‌.. చైతూని అడుగు" అని ఉచిత స‌ల‌హా ఇచ్చారు. ఇది చూసిన ఆమె అభిమానులు సామ్ భ‌లే స‌మాధాన‌మిచ్చిందంటున్నారు. అలాగే ఆమె నుంచి రిప్లై అందుకున్న సద‌రు నెటిజ‌న్‌ను అదృష్ట‌వంతుడ‌ని అభివ‌ర్ణిస్తున్నారు. కాగా సామ్.. మ‌జిలీ, ఓ బేబి, జాను సినిమాల త‌ర్వాత కొత్త సినిమా విష‌యంలో ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ప్ర‌స్తుతం యాడ్స్‌కు ప‌ని చేస్తూ బిజీగా ఉంటున్నారు. (చ‌ద‌వండి: మిస్‌ ఇండియా రివ్యూ: ‘మిస్‌’ అయింది!)

Advertisement
 
Advertisement
Advertisement