సమంత చిట్‌చాట్‌.. ఆ ప్రశ్నతో విసిగించిన నెటిజన్! | Samantha comment on her weight with a powerful response | Sakshi
Sakshi News home page

Samantha: సమంతకు మళ్లీ అదే ప్రశ్న.. కాస్తా గట్టిగానే ఇచ్చిపడేసింది!

Nov 4 2024 7:30 PM | Updated on Nov 4 2024 7:41 PM

Samantha comment on her weight with a powerful response

హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వర్షన్ హానీ:బన్నీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జంటగా నటించింది. ఈ సిరీస్‌ త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ఇంటరాక్షన్‌ సెషన్ నిర్వహించింది. 

ఈ సందర్భంగా సమంతకు ఓ నెటిజన్‌ ఆసక్తికర ప్రశ్న వేశాడు. దయచేసి మీరు కాస్తా బరువు పెరగండి మేడమ్? అని ‍అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు సమంత సైతం స్పందించింది, తనదైన శైలిలో నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సమంత వీడియోలో మాట్లాడుతూ..'మళ్లీ అదే ప్రశ్న. నా బరువు గురించి నాకు అంతా తెలుసు.. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం నేను  కఠినమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో ఉన్నా.. అందువల్లే నా బరువు నిర్దిష్టంగానే ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇలానే ఉండాలి. దయచేసి ఇతరులను జడ్జ్ చేయడం ఆపండి. అవతలి వారిని కూడా జీవించనివ్వండి. ప్లీజ్ గాయ్స్‌.. ఇది 2024' అంటూ కౌంటర్‌ ఇచ్చింది. తనకు మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైందని సమంత చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్‌కు కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చేసింది. కాగా.. సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌ ఈ నెల 7 నుంచి  అమెజాన్‌ ప్రైమ్ వీడీయోలో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement