నాలోని చంటిపిల్ల గంతులేస్తోంది : సమంత

samantha Bids Goodbye To Sakunthalam Team - Sakshi

‘శాకుంతలం’ ప్రపంచానికి దూరం అవుతున్నందకు బాధపడుతున్నారు సమంత. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళ యాక్టర్‌ దేవ్‌ మోహన్‌ కనిపిస్తారు. ‘దిల్‌’రాజు, నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను సమంత పూర్తి చేశారు.

ఈ సినిమా గురించి సమంత చెబుతూ – ‘‘గుణశేఖర్‌గారు కథ చెప్పినప్పుడు ‘శాకుంతలం’ ప్రపంచాన్ని ఊహించుకున్నాను. కానీ అంత అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించడం సాధ్యమేనా? అనిపించింది. అయితే నా అంచనాలను మించిన ప్రపంచాన్ని సృష్టించారాయన. అద్భుతమైన కథలను ఇష్టపడే నాలోని చంటిపిల్ల కలను నిజం చేసిన గాడ్‌ఫాదర్‌ గుణశేఖర్‌గారు. ఇప్పుడు నాలోని ఆ చంటిపిల్ల సంతోషంతో గంతులేస్తోంది. ఈ యూనిట్‌కి బైబై చెబుతుంటే బాధగా ఉంది’’ అని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top