Samantha Begins Yashoda Movie Promotions, Her New Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha Yashoda Promotions: ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత

Nov 7 2022 3:08 PM | Updated on Nov 7 2022 4:20 PM

Samantha Begins Yashoda Promotions Shares Photos - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన యశోద సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అయితే సమంత అనారోగ్యం కారణంగా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటుందని టాక్‌ వినిపించింది. ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సామ్‌  అందుకు తగిన చికిత్స తీసుకుంటుంది. డాక్లర్ల పర్యవేక్షణలో సెలైన్‌ పెట్టుకొని మరీ డబ్బింగ్‌ కంప్లీట్‌ చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బయటకు రావడం దాదాపు కష్టమే అని నిర్మాతలు సహా అభిమానులు కూడా అనుకున్నారు. కానీ అందరిని ఆశ్వర్యపరుస్తూ సమంత యశోద ప్రమోషన్స్‌లో పాల్గొంది.  దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా సామ్‌ షేర్‌ చేస్తూ.. 'నా స్నేహితుడు రాజ్‌ అండ్‌ డీకే చెప్పినట్లుగా.. మన రోజులు ఎంత చెత్తగా ఉన్నా సరే ముందుకు సాగాలి.

ఈనెల 11న యశోద ప్రమోషన్స్‌ కోసం మీ ముందుకు రాబోతున్నాను' అంటూ ఓ పోస్ట్‌ను షేర్‌ చేసింది. ఈ ఫోటోల్లో సామ్‌ వీక్‌ అయినట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం సరిగా లేకపోయినా సినిమా కోసం సామ్‌ డెడికేషన్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement