వచ్చేసామ్‌ | Samantha and Naga Chaitanya get back from Maldives vacation | Sakshi
Sakshi News home page

వచ్చేసామ్‌

Dec 1 2020 12:53 AM | Updated on Dec 1 2020 1:34 AM

Samantha and Naga Chaitanya get back from Maldives vacation - Sakshi

టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ నాగచైతన్య–సమంత హైదరాబాద్‌ తిరిగొచ్చేశారు. నవంబర్‌ 23న నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా ఈ దంపతులు మాల్దీవులు వెళ్లారు. అక్కడ సరదాగా సందడి చేసిన ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా సమంత ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకున్నారు. దాదాపు వారం పాటు వెకేషన్‌ని ఎంజాయ్‌ చేసి, ‘చేసామ్‌’ (నాగచైతన్య–సమంతని అలానే అంటారు) హైదరాబాద్‌ తిరిగి వచ్చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘లవ్‌ స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్న ‘థాంక్యూ’ అనే చిత్రం షూటింగ్‌ను చైతన్య త్వరలో ప్రారంభించనున్నారు. కాగా ‘స్యామ్‌ జామ్‌’ వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉన్న సమంత.. విజయ్‌ సేతుపతి హీరోగా నటించనున్న ఓ తమిళ చిత్రంలోనూ నటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement