Samajavaragamana Movie OTT Release Date Update, Check OTT Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Samajavaragamana OTT Release Date: 'సామజవరగమన' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడే!

Jul 11 2023 9:20 PM | Updated on Jul 21 2023 2:30 PM

Samajavaragamana Movie OTT Release Date  - Sakshi

ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు. ఈ మధ్య కాలంలో అలా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, సూపర్‌హిట్ అయిన మూవీ 'సామజవరగమన'. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం.. ఇప్పటికి రెండు వారాలకు అవుతున్నా విజయవంతంగా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది.

(ఇదీ చదవండి: తెలుగు హీరోతో ధోనీ కొత్త సినిమా?)

సినిమాల్లో మిగతా వాటి సంగతేమో గానీ కామెడీ జానర్ అనేది ఎవర్‌గ్రీన్. కరెక్ట్ గా వర్కౌట్ అయితే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా బాగుంటే కలెక్షన్స్ గట్టిగా వస్తాయి. అలానే జస్ట్ రూ.7 కోట్లతో తీసిన సినిమా 'సామజవరగమన'.. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి రెండు రోజుల అంతంతమాత్రంగా ఉన్న ఈ సినిమా శనివారం నుంచి రయ్ మని దూసుకెళ్లింది. ప‍్రస్తుతం మూడు-నాలుగు రెట్ల లాభాలని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా 'సామజవరగమన'.. డిజిటల్ హక్కుల్ని ఆహా సొంతం చేసుకుంది. జూలై 28 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఆల్రెడీ చూసినవాళ్లు కూడా మళ్లీ చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

(ఇదీ చదవండి: పెళ్లయిన నటితో తెలుగు యాక్టర్ డేటింగ్?)

Advertisement
 
Advertisement
Advertisement