సల్మాన్ సినిమాకు ఇన్ని కష్టాలా? | Salman Sikandar Movie Box Office Collection Details | Sakshi
Sakshi News home page

Sikandar Collection: భాయ్ మూవీ.. సెంచరీ దాటడం కష్టమా!

Apr 2 2025 3:28 PM | Updated on Apr 2 2025 3:42 PM

Salman Sikandar Movie Box Office Collection Details

ఈద్ వచ్చిందంటే సల్మాన్ ఖాన్ సినిమా రావాల్సిందే అనేది బాలీవుడ్ లో చాన్నాళ్లుగా ఉన్న సెంటిమెంట్. ఈసారి అలా సికిందర్ మూవీ రిలీజైంది. కానీ మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ బయటకు వచ్చింది. దీంతో సినిమా హైప్ అమాంతం కిందకు పడిపోయింది. ఇప్పట్లో లేవడం కూడా కష్టమే.

(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)

ఇకపోతే తొలిరోజు రూ.26 కోట్ల మేర వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రంజాన్ సందర్బంగా రెండో రోజు రూ.29 కోట్ల వరకు సొంతం చేసుకుంది. మూడో రోజు కూడా కాస్త అటు ఇటుగా ఓ రూ.20 కోట్లు వరకు వచ్చాయని అంటున్నారు. అలా ఇ‍ప్పటివరకు రూ.75.49 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ టాక్.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలంటే కాస్త అటుఇటుగా ఉన్నా సరే రెండు మూడు రోజుల్లో రూ.100 కోట్ల వసూళ్లు వస్తుంటాయి. కానీ సల్మాన్ మూవీకి మాత్రం రోజురోజుకు కలెక్షన్స్ పడిపోతున్నాయనిపిస్తోంది. మరోవైపు చాలాచోట్ల జనాల్లేక షోలు రద్దవుతున్నాయని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మూవీకి రూ.100 కోట్ల వసూళ్లయినా వస్తాయా అనేది సందేహంగా మారింది.  

(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి)

Advertisement
 
Advertisement
Advertisement