రెండు సినిమాలు బరిలో ఉన్నా సలార్ రిలీజ్‌.. ఎందుకంటే? | Sakshi
Sakshi News home page

ప్రభాస్ 'సలార్‌' విడుదల.. ఆ రోజే ఎందుకంటే?

Published Tue, Dec 12 2023 4:03 PM

Salaar producer says release date based on astrology - Sakshi

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్(పార్ట్ -1). ఈ చిత్రంలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్‌ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంపై పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ తేదీ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే చివరికి ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరో పది రోజుల్లోనే సినిమా రిలీజ్ కానుండగా.. ఇటీవలే ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ సలార్‌ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రిలీజ్‌ తేది విషయంపై క్లారిటీ ఇచ్చారు. 

(ఇది చదవండి: బిగ్‌బాస్‌తోనే ఫేమ్.. వరుణ్‌ తేజ్‌ పెళ్లి వార్తతో షాకయ్యా!)

సలార్‌ చిత్రం 2014లో వచ్చిన ఉగ్రమ్ చిత్రానికి రీమేక్ కాదని విజయ్ కిరంగదూర్ వెల్లడించారు. ఉగ్రమ్ మాదిరిగానే ఈ చిత్రం రీమేక్ అని చాలామంది భావించారని.. అలాంటిదేం కాదని కొట్టిపారేశారు. ప్రశాంత్ నీల్.. ఉగ్రమ్‌తో పాటు కేజీఎఫ్‌ తెరకెక్కించాడని.. ప్రతిసారి భిన్నంగా ఏం చేయాలో అతనికి తెలుసని అన్నారు. సలార్ రీమేక్‌ అనే వార్తలు కేవలం రూమర్స్ అని అన్నారు.
 
అంతే కాకుండా సలార్‌ విడుదల తేదీ డిసెంబర్‌ 22 నిర్ణయించడంపై విజయ్ కిరంగదూర్ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ ఉంటుందని అన్నారు.  మాకు జాతకాలపై ఉన్న నమ్మకం ప్రకారమే ఆ తేదీని ఎంపిక చేశామని తెలిపారు. డంకీ, అక్వామన్ పోటీలో ఉన్నప్పటికీ.. దశాబ్దం కాలంగా తాము అనుసరిస్తున్న పద్ధతినే సలార్ విషయంలోనూ కొనసాగిస్తున్నట్లు విజయ్ కిరంగదూర్ వివరించారు. 

(ఇది చదవండి: పోస్టర్ కోసం క్రియేట్ చేసిన పదం.. కొత్త సినిమా టైటిల్‌గా!)

 సెన్సార్ పూర్తి

కాగా.. ఇటీవలే సలార్ పూర్తి కాగా.. 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలానే ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. అంటే 18 ఏళ్ల నిండని వాళ్లు.. ఈ మూవీ చూడటం కుదరదని సెన్సార్ ‍బోర్ట్ చెబుతోంది. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Advertisement
 
Advertisement