పోస్టర్ కోసం క్రియేట్ చేసిన పదం.. కొత్త సినిమా టైటిల్‌గా! | Sakshi
Sakshi News home page

Producer SKN: 'బేబి' నిర్మాత మరో మూవీ.. ఏకంగా ఆ టైటిల్‌తో

Published Mon, Dec 11 2023 4:52 PM

Producer SKN New Movie Titled As Cult Bomma - Sakshi

'బేబి' సినిమాతో నిర్మాత ఎస్కేఎన్.. తెలుగు ఇండస్ట్రీకి క్రేజీ హిట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వరస మూవీస్ నిర్మిస్తున్నారు. 'బేబి' హీరోహీరోయిన్ కాంబోలో ఓ చిత్రం, రష్మిక మెయిన్ లీడ్‌గా 'గర్ల్‌ఫ్రెండ్' అనే మూవీ తీస్తున్నారు. రీసెంట్‌గానే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్)

మరోవైపు సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా ఓ సినిమా తీస్తున్న నిర్మాత ఎస్కేఎన్..  తను నిర్మించే ఓ కొత్త మూవీ కోసం 'కల్ట్ బొమ్మ' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. అయితే 'బేబి' హిట్ కావడంతో అప్పుడు ప్రమోషన్స్ కోసం పోస్టర్స్‌పై కల్ట్ బొమ్మ అని వేశారు. ఇప్పుడు ఈ పదాన్ని ఏకంగా మూవీ టైటిల్ చేసేయడం డిఫరెంట్‌గా అనిపించింది. 

ఏమైనా బేబి ప్రమోషన్‌లో కల్ట్ బ్లాక్ బస్టర్, కల్ట్ బొమ్మ అనే పదాన్ని తన స్పీచుల్లో ఎస్ కే ఎన్ బాగా వాడి, ఆ పదాలను పాపులర్ చేశారు. ఈసారి అదే టైటిల్‌తో సినిమా చేస్తుండటం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

(ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement