'సలార్' స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అదీ మ్యాటర్! | Sakshi
Sakshi News home page

Salaar Movie: ప్రభాస్ 'సలార్' కథ ఇదే.. కాన్సెప్ట్ రివీల్ చేసిన ప్రశాంత్ నీల్!

Published Tue, Nov 28 2023 9:07 PM

Salaar Movie Story Line Revealed By Director Prashanth Neel - Sakshi

డార్లింగ్ ప్రభాస్ 'సలార్' మేనియా మొదలైపోయింది. మరో రెండు రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అప్పుడే హడావుడి చేస్తున్నారు. అదే టైంలో ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని టైమ్ లెక్కేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'సలార్' స్టోరీ లైన్ లీక్ చేసి పడేశాడు. ఇంతకీ స్టోరీ ఏంటి? సినిమా ఎలా ఉండబోతుంది?

'కేజీఎఫ్' ఫ్రాంచైజీ మూవీస్‌తో వేరే లెవల్ క్రేజ్ సంపాదించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో చేస్తున్న సినిమా 'సలార్'. ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేయాల్సిన ఈ మూవీ.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. డిసెంబరు 1న సాయంత్రం 7:19 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

(ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)

తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌తో మాట్లాడిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. 'సలార్' స్టోరీ లైన్ రివీల్ చేయడంతో పాటు కొన్ని ఆసక్తికర విషయాల్ని బయటపెట్టాడు. 'ఇద్దరు ఫ్రెండ్స్.. శత్రువుల అయ్యే స్టోరీనే 'సలార్'. ఇందులో స్నేహం అనేది మెయిన్ ఎమోషన్. ఇప్పుడు రిలీజయ్యే తొలి భాగంలో సగం స్టోరీ చెప్పబోతున్నాం. ఓవరాల్‌గా ఇద్దరు ఫ్రెండ్స్ చేసే జర్నీనే రెండు పార్ట్స్‌లో చూపించబోతున్నాం. డిసెంబరు 1న రిలీజయ్యే ట్రైలర్‌తో 'సలార్' ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాం' అని చెప్పాడు.

'సలార్' సినిమాతో 'కేజీఎఫ్'కి ఎలాంటి పోలిక లేదని.. స్టోరీ దగ్గర నుంచి దేనికదే డిఫరెంట్‌గా ఉంటాయని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ రిలీజైన తర్వాత కొన్నాళ్లకు రెండో భాగం షూటింగ్ మొదలుపెడతామని చెప్పిన ఈ డైరెక్టర్.. 'సలార్ 2' రిలీజ్ ఎప్పుడనేది మాత్రం తాను ఇప్పుడే ఏం చెప్పలేనని అన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ 'సలార్' స్టోరీ లైన్ కాస్త బయటపెట్టేసరికి.. ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాకిచ్చిన బిగ్‌బాస్.. ఓట్లు పడినా ఈసారి వేటు గ్యారంటీ!)

Advertisement

తప్పక చదవండి

Advertisement