Salaar Director Prashanth Neel Warning On Shooting Video Leaked - Sakshi
Sakshi News home page

Prabhas Salaar: లీకులపై డైరెక్టర్ ఆగ్రహం.. సెట్స్‌లోకి అవి తీసుకురావొద్దు..!

Sep 26 2022 6:52 PM | Updated on Sep 26 2022 7:11 PM

Salaar Director Prasanth Neel Warning On Shooting Video Leaks - Sakshi

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సలార్‌'కు లీకుల బెడద తప్పడం లేదు. ఇటీవలే ప్రభాస్ సెట్‌లో పాల్గొన్న వీడియో సోషల్ మీడీయాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో చిత్రబృందానికి ప్రశాంత్ నీల్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు సెట్స్‌లోకి మొబైల్ తీసుకురావొద్దంటూ ఆదేశించారని టాక్.  

(చదవండి: సలార్‌కు తప్పని లీకుల బెడద.. ప్రభాస్ మేకింగ్ వీడియో వైరల్)

 మరోవైపు ‘సలార్‌’లో కథానాయికగా నటిస్తున్న శ్రుతిహాసన్‌ దర్శకుడిపై ప్రశంసలు కురిపించింది. నటులతో ఆయన వ్యవహరించే తీరు అద్భుతమని చెప్పుకొచ్చింది. సెట్స్‌లో ఆయనతో పనిచేయడం కూడా సులువుగా ఉంటుంది. ప్రతి సన్నివేశంపై ఆయనకు చక్కని విజన్‌ ఉందని.. ప్రతి సినిమాకు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని కొనియాడింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌, సుకుమార్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 28న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలోనూ ఇలాగే జరగడంతో జక్కన్న కూడా ఇలాగే కఠిన నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement