ఇంట్లో ఉంటే పిల్లలు పుడతారేమోనని భయంగా ఉంది: సైఫ్‌ | Saif Ali Khan Scared of staying Home, He Jokes Might Have More kids | Sakshi
Sakshi News home page

Saif Ali Khan: ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడతారేమోనని భయంగా ఉంది

Nov 12 2021 9:53 PM | Updated on Nov 12 2021 9:53 PM

Saif Ali Khan Scared of staying Home, He Jokes Might Have More kids - Sakshi

'మీకు పని అంటే ప్రేమా? లేదంటే రెండో కొడుకు పుట్టాక కుటుంబం కోసం ఎక్కువ పని చేయాల్సి వస్తుందా? అని ప్రశ్నించాడు. దీనికి సైఫ్‌ ఫన్నీ రిప్లై ఇచ్చాడు.

Saif Ali Khan: ఇంట్లో ఉండటం కన్నా పనులతో బిజీగా ఉండటమే మేలంటున్నాడు బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌. తను ప్రధాన పాత్రలో నటించిన 'బంటీ ఔర్‌ బబ్లీ 2' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్‌ శర్మ షోకు హాజరయ్యాడు సైఫ్‌. అతడితో పాటు చిత్రయూనిట్‌ సభ్యులు రాణీ ముఖర్జీ, సిద్ధాంత్‌ చతుర్వేది, శర్వానీ సైతం షోలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కపిల్‌ శర్మ.. సైఫ్‌ తాండవ్‌,  భూత్‌ పోలీస్‌, ఇప్పుడు బంటీ ఔర్‌ బబ్లూ 2.. ఇలా వరుస సినిమాలు చేయడంపై సందేహం వ్యక్తం చేశాడు.

'మీకు పని అంటే ప్రేమా? లేదంటే రెండో కొడుకు పుట్టాక కుటుంబం కోసం ఎక్కువ పని చేయాల్సి వస్తుందా? అని ప్రశ్నించాడు. దీనికి సైఫ్‌ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువమమంది పిల్లలు పుట్టేలా ఉన్నారని, ఆ భయంతోనే ఇలా సినిమాలతో బిజీగా ఉన్నానన్నాడు. ఆయన సమాధానం విని కపిల్ సహా అక్కడున్నవాళ్లంతా ఘొల్లున నవ్వారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement