ఏసీ రిపేర్‌, లీకేజీ ఉందని ఫోన్‌ చేసేవారు: సైఫ్‌ అలీఖాన్‌ | Saif Ali Khan Says Being A Landlord is Head Ache | Sakshi
Sakshi News home page

Saif Ali Khan: ఏసీ రిపేర్‌, లీకేజీ ఉందంటూ ఫోన్‌ చేసేవారు.. దాంతో

Oct 8 2021 11:32 AM | Updated on Oct 8 2021 3:21 PM

Saif Ali Khan Says Being A Landlord is Head Ache - Sakshi

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నట్లులో ఒకరు సైఫ్‌ అలీఖాన్‌. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా ది కపిల్‌ శర్మ షోకి గెస్ట్‌గా వచ్చాడు. ఈ తరుణంలో ఫ్లాట్ల యజమానిగా ఉండే బాధలను తెలిపాడు..

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో సైఫ్‌ అలీఖాన్‌ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా ది కపిల్‌ శర్మ షోకి గెస్ట్‌గా వచ్చాడు. తన తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆ సినిమా హీరోయిన్లు యామీ గౌతమ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నాడు. ఈ తరుణంలో ఫ్లాట్ల యజమానిగా ఉండే బాధలను తెలిపాడు.

కపిల్‌ శర్మ షోలో ఫ్లాట్లు రెంట్‌కి ఇస్తే ఉండే ఇబ్బందుల గురించి హోస్ట్‌ కపిల్‌ మాట్లాడాడు. ఈ విషయాన్ని ఓన్‌ చేసుకున్న సైఫ్‌ తను చిన్నపాటి లాండ్‌లార్డ్‌నని, ఆ టార్చర్‌ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నాడు.

‘ఇంకా పాత మనస్తత్వం ఉండడం వల్ల, వచ్చే ఆదాయాన్ని ఫ్లాట్లలో పెట్టుబడులు పెట్టి.. అద్దెకు ఇస్తుంటా. చాలా సార్లు అద్దెకున్నవారు ఏసీ రిపేర్‌, లీకేజీలు ఉన్నాయంటూ ఫోన్‌ చేసేవారు. కొన్నిసార్లు ఈ పని కోసం ఎవరినైనా నియమించుకోవాలనిపించేదని’ తెలిపాడు. ‘ఆ బాధ తట్టుకోలేక ఇప్పుడైతే ఓ మేనేజర్‌ని నియమించుకున్నాను. కానీ అంతకుముందు మాత్రం అన్నీ తానే చూసుకునేవాడినని’ అంటూ సైఫ్‌ చెప్పుకొచ్చాడు.

అయితే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇటీవలే రెండో సంతానంగా జెమ్‌ పుట్టిన విషయం తెలిసిందే. అతను పుట్టడానికి ముందే ఉన్న ఇంటిని రూ.3.5లక్షలకు అద్దెకు ఇ‍చ్చి, వేరే ఇంటికి మారారు. కాగా సైఫ్‌ ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ‘ఆదిపురుష్‌’, ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ నటిస్తున్నాడు.

చదవండి: కరీనాకు ఏ విషయంలోనూ సలహాలు ఇవ్వను: సైఫ్‌ అలీ ఖాన్‌

Advertisement
 
Advertisement
Advertisement