ప్ర‌భాస్ అన్నా.. సారీ లెఫ్ట్‌ అవుతున్నా: తేజ్‌ | Sai Dharam Tej May Get Engaged In This Year | Sakshi
Sakshi News home page

సాయిధ‌ర‌మ్ ‌తేజ్ పెళ్లి ప్ర‌క‌ట‌న‌!

Aug 23 2020 11:48 AM | Updated on Aug 23 2020 2:39 PM

Sai Dharam Tej May Get Engaged In This Year - Sakshi

"నో పెళ్లి.. దాని తల్లి.. ఈ త‌ప్పే చేయ‌కురా వెళ్లి.." అంటూ 'సోలో బ‌తుకే సో బెట‌ర్‌'లో అంద‌రికీ ఉప‌దేశ‌మిచ్చారు మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌. కానీ విచిత్రంగా ఈ పాట విడుద‌లైన త‌ర్వాత టాలీవుడ్‌లో కొంద‌రి పెళ్లిళ్లు జ‌రిపోగా, మ‌రికొంద‌రికి వివాహ ఘ‌డియ‌లు ముంచుకు రావ‌డంతో ల‌గ్న‌తాంబూలాలు పెట్టేసుకున్నారు. వీళ్లు మాత్ర‌మే కాదు.. తాజాగా తాను కూడా పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు సిగ్న‌ల్ ఇచ్చేశారు సాయి ధ‌ర‌మ్‌. "ఒక్కోసారి మ‌నం ఎన్నో అనుకుంటాం కానీ, ఆ టైం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌దు మ‌రి అని చెప్పుకొస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. (నా విజయం వాయిదా పడిందనుకున్నా!)

ఇందులో బ్యాచిల‌ర్ హీరోలంద‌రూ క‌లిసి ఉన్న 'సింగిల్ ఆర్మీ' అనే వాట్సాప్ గ్రూప్ నుంచి నిఖిల్‌, నితిన్‌, రానా.. ఇలా ఒక్కొక్క‌రు లెఫ్ట్ అయ్యారు. చివ‌ర్లో "ప్ర‌భాస్ అన్నా.. సారీ, ఇప్పుడు నా వంతు వ‌చ్చిందం"టూ సుప్రీం హీరో కూడా లెఫ్ట్ అయ్యారు. దీంతో ఆయ‌న కూడా త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నున్నార‌ని అభిమానులు అంటున్నారు. అయితే ఈ విష‌యం గురించి పూర్తి క్లారిటీ రావాలంటే రేపు ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు వేచి ఉండాల్సిందే. (‘మెగా కుటుంబం ఎదగడానికి ఇదే కారణం’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement