ఈ హీరోయిన్‌కు విరాట్‌ బావ అవుతాడట! కోహ్లి గురించి ఏమందంటే? | Saindhav Actress Ruhani Sharma Reveals About Her Relation With Virat Kohli And Anushka Sharma, Deets Inside - Sakshi
Sakshi News home page

Ruhani Sharma: విరాట్ నాకు బావ అవుతాడు.. నాతో ఎలా ఉంటాడంటే?

Published Wed, Jan 10 2024 1:38 PM

Ruhani Sharma Reveals Her Relation with Virat Kohli, Anushka Sharma - Sakshi

'చి.ల.సౌ.' సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది రుహానీ శర్మ. ‘హిట్‌’, ‘డర్టీ హరి’, ‘101 జిల్లాల అందగాడు’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ హీరోయిన్‌గా సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్' మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. 

వెంకీ మామకు అభిమానిని
తాజాగా ఓ కార్యక్రమానికి వెళ్లిన ఈ బ్యూటీ తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నేను చిన్నప్పటినుంచి వెంకీ సర్ సినిమాలు చూస్తూ పెరిగాను. సైంధవ్‌లో నటించాక ఆయనకు ఇంకా పెద్ద అభిమానిగా మారాను. ఇప్పుడాయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. చిన్నప్పటినుంచి డాక్టర్ అవ్వాలని కోరికగా ఉండేది. కానీ సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు సైంధవ్‌లో డాక్టర్ పాత్ర పోషించడం సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. అక్కడున్న విలేఖరి.. అనుష్క శర్మతో మీ అనుబంధం ఎలా ఉంటుంది? అని ప్రశ్నించింది.

విరాట్ బావ ెలా ుంటాడంటే?
ఇది విని అవాక్కైన హీరోయిన్.. 'నేను ఈ విషయం గురించి ఎప్పుడూ, ఎక్కడా మీడియా ముందు చెప్పలేదు. గోప్యంగానే ఉంచాను. మీకెలా తెలిసింది? అడిగారు కాబట్టి చెప్తున్నా.. అవును, అనుష్క నాకు సోదరి అవుతుంది' అని చెప్పింది. దీంతో విలేఖరి.. 'అనుష్క అక్క అంటే విరాట్ కోహ్లి బావ అవుతాడు.. మీ బావ మీతో ఎలా ఉంటాడు?' అని అడిగింది. రుహానీ మాట్లాడుతూ.. 'విరాట్ నాతో చాలా బాగుంటాడు. వాళ్లిద్దరూ ఫిల్టర్ లేకుండా చాలా సింపుల్‌గా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది' అని చెప్పుకొచ్చింది. రుహానీ శర్మకు విరాట్- అనుష్క దగ్గరి బంధువులే అని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

చదవండి: 'విక్రమ్‌కు అస్సలు నటించడమే రాదు'.. నటి భర్త, డైరెక్టర్‌ సంచలన కామెంట్స్!

Advertisement
 
Advertisement