RRR: ‘జనని’ లో కనిపించని ఎమోషన్స్‌ ఉంటాయి : రాజమౌళి | RRR Movie: SS Rajamouli Interesting Comments On Janani Song | Sakshi
Sakshi News home page

RRR: కనిపించని ఎమోషన్స్‌తో కలగలిపిన సాంగే 'జనని' : రాజమౌళి

Nov 25 2021 4:00 PM | Updated on Nov 25 2021 4:34 PM

RRR Movie: SS Rajamouli Interesting Comments On Janani Song - Sakshi

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలతో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నవంబర్‌ 26న ‘జనని’పాటను విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్స్‌తో పాటు రెండు పాటలకు బారీ రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘నాటు నాటు’సాంగ్‌లో ఎన్టీఆర్‌, చెర్రీ వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇక ఈ శుక్రవారం విడుదలయ్యే ‘జనని’సాంగ్‌ చాలా ప్రత్యేకమైనది చెబుతున్నాడు రాజమౌళి.

సినిమాకు ఎలాగైతే ముందు రోజు మీడియాకు ప్రివ్యూ షోలు వేస్తారో.. అలాగే ‘జనని' పాటకు కూడా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాడు జక్కన్న.   గురువారం ఉదయం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మీడియా కోసం ప్రత్యేకంగా ఈ సాంగ్‌ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘జనని’ సాంగ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి ఓ సోల్‌. ఈ సాంగ్‌ కోసం పెద్దన్న కీరవాణి రెండు నెలలు శ్రమించాడు. ఆయనే లిరిక్స్‌ అందించాడు.  ఈ సాంగ్‌లో కనిపించని ఎమోషన్స్‌ ఉంటాయి. అంటే ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలా సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ ఎమోషనల్ లోనే దాగి ఉంటుంది. జనని పాటను మీ ముందుకు తెస్తున్నందుకు గర్వంగా ఉంది’అన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ సోల్ ఆంథెమ్' పేరుతో ఈ పాట శుక్రవారం సాయంతం మనందరి ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement