RRR Movie Press Meet: ఆర్‌ఆర్ఆర్‌ టీం ప్రెస్‌ మీట్‌, అలియా భట్‌ సందడి

RRR Movie Press Meet In Hyderabad Heroine Alia Bhatt And Hero Attend - Sakshi

దర్శకుధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఇప్పటికే షూటింగ్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు(శనివారం) ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది.

ఈ మీడియా సమావేశంలో దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, రాంచరణ్‌, జూ. ఎన్టీఆర్‌తో పాటు హీరోయిన్‌ అలియా భట్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆర్‌ఆర్‌ఆర్‌ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పకొచ్చింది. మూవీ స్టార్ట్‌ చేశాక ఏ సన్నివేశం ఫస్ట్‌ చేశారని అడగ్గా.. ట్రైలర్‌ ఉన్న బైక్‌ సీన్‌ చేశానని, అది చేశాక తారక్‌, చరణ్‌ స్నేహితుల్లో మాట్లాడుకుంటూ చాలా దగ్గరి వాళ్లలా కలిసిపోయారు. ఇక అప్పుడే అర్థమైంది వారిద్దరి మధ్య బాండింగ్‌. ఇక మా సినిమాకు విరిద్దరే కరెక్ట్‌ అనుకున్నా అంటూ సమాధానం ఇచ్చాడు. ఇంకా షూటింగ్‌ సెట్‌లో ఎన్టీఆర్‌, చరణ్‌ చేసిన అల్లరి, సందడి గురించి జక్కన్న, అలియాలు ఏం చెప్పరో వారి మాటల్లోనే..

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top