SS Rajamouli's RRR Movie One Day Shoot Cost, Details Inside - Sakshi
Sakshi News home page

RRR Movie: 'ఆర్‌ఆర్‌ఆర్' ఒక్క రోజు షూటింగ్‌ ఖర్చు ఎంతో తెలుసా ?

Dec 31 2021 12:30 PM | Updated on Dec 31 2021 1:44 PM

RRR Movie One Day Shoot Cost Is 75 Lakh Rupees - Sakshi

RRR Movie One Day Shoot Cost Is 75 Lakh Rupees: భారతదేశంలోనే మోస్ట్‌ అవేయిటెడ్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం.. రణం.. రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్‌ స్టార్‌ హీరోస్‌ జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ కాంబోలో వస్తున్న భారీ మల్టీస్టారర్‌పై అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగానే సినిమా ఉంటుందని ట్రైలర్‌, పాటలు, మేకింగ్‌ వీడియోస్‌ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7, 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సినిమా దగ్గరపడటంతో మూవీ ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది జక్కన్న టీం. ఇందులో భాగంగానే అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ‍్యూలు ఇస్తున్నారు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌.

కాగా ఓ ఇంటర్వ‍్యూలో రాజమౌళి చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) షూటింగ్‌ సమయంలో రాజమౌళిని ఎక్కువగా టెన్షన్‌కు గురి చేసిన విషయం ఏంటని అడిగినప్పుడు తన మనసులోని మాట బయటపెట్టాడు జక్కన్న. 'భారీ సెట్లు వేసి పెద్ద యూనిట్లతో సినిమా తీస్తున్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే నాకు టెన్షన్‌ ఎక్కువవుతుంది. అది నన్ను ఎక్కువ టెన్షన్‌కు గురి చేస్తుంది. ఒక్క రోజు షూటింగ్‌కు రూ. 75 లక్షలు ఖర్చవుతుంది. అలాంటప్పుడు ఏదైనా అనుకున్నది అనుకున్నట్టుగా జరగకుంటే నాకు విపరీతమైన కోపం వచ్చేది.' అని తెలిపాడు రాజమౌళి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బడ్జెట్‌ ఇంచుమించుగా రూ. 400 కోట్లని తెలిసిందే. 

ఇదీ చదవండి: అలరిస్తున్న అల్లూరి, గర్జిస్తున్న భీం.. మేకింగ్‌ వీడియోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement