అభిమానుల నుంచి జక్కన్నకు ఆసక్తికర గిఫ్ట్‌.. దర్శక ధీరుడి భారీ కటౌట్‌ | RRR Movie Director Rajamouli Massive Cutout In Hyderabad | Sakshi
Sakshi News home page

RRR Movie Director Rajamouli: జక్కన్నకు భారీ కటౌట్‌.. నెట్టింట వైరల్‌

Mar 24 2022 7:31 PM | Updated on Mar 24 2022 7:39 PM

RRR Movie Director Rajamouli Massive Cutout In Hyderabad - Sakshi

RRR Movie Director Rajamouli Massive Cutout In Hyderabad: సినిమా హీరోలను అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు. ఎవరిమీద చూపినంచా ప్రేమ ఒలకబోస్తారు. తమ ఫేవరెట్‌ హీరోలను 'అన్న' అని పిలుస్తూ ఇంట్లో మనిషిలా భావిస్తారు. అలాంటిది వారి అభిమాన హీరో సినిమా రిలీజ్‌ అంటే ఊగిపోతారు. అది పెద్ద పండగలా జరుపుకుంటారు. కటౌట్‌లు, పాలాభిషేకాలతో తమ అభిమానాన్ని చాటుతారు. అయితే ఇప్పుడు ఒక డైరెక్టర్‌కు భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. ఆ డైరెక్టర్‌ ఎవరో కాదు.. యావత్‌ భారతదేశం ఎదురుచూస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమాను తెరకెక్కించిన ఓటమెరుగని దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి. అవును.. రాజమౌళిపై ప్రేమతో ఆయనకు భారీగా కటౌట్‌ కట్టారు ఆయన ఫ్యాన్స్‌. ప్రస్తుతం ఈ భారీ కటౌట్‌ సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తోంది. 

చదవండి: అధిక ధరకు 'ఆర్ఆర్ఆర్‌' టికెట్లు.. ఎక్కడ ? ఎలా ఉన్నాయంటే ?

స్టూడెంట్‌ నెం.1 నుంచి మొన్నటి బాహబలి 2 దాకా జక్కన్న చెక్కిన ప్రతీ సినిమా బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్‌. ఇప్పుడు మరికొన్ని గంటల్లో విడుదల కానున్న రౌద్రం.. రణం.. రుధిరం అన్నింటికి మించి విజయం దక్కించుకోనుందని రాజమౌళి విశ్వాసం వ్యక్తం చేశారు. బాహుబలితో భారతీయ సినీమా రేంజ్‌ ఏంటో చూపించిన జక్కన్నకు అనేకమంది అభిమానులు ఏర్పడ్డారు. ఈ అభిమానంతోనే హైదరాబాద్‌ సుదర్శన్‌ 35 ఎంఎం వద్ద జక్కన్న భారీ కటౌట్‌ పెట్టడం ఆసక్తిరేపుతోంది. ఈ కటౌట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా  అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు 'ఆర్ఆర్ఆర్' సినిమా ఈ శుక్రవారం అంటే మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.



చదవండి:  'ఆర్ఆర్ఆర్‌'లో అలరించే కీలక పాత్రధారులు వీరే..

Advertisement
 
Advertisement
Advertisement