Rishab Shetty Said He Quit Eating Non Veg 20 to 30 Days Before Shooting - Sakshi
Sakshi News home page

Rishab Shetty: ‘దైవ కోల సీన్స్‌ చేసేటప్పుడు ఏం తినలేదు, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగా’

Oct 31 2022 2:10 PM | Updated on Oct 31 2022 3:44 PM

Rishab Shetty Said He Quit Eating Non Veg 20 to 30 Days Before Shooting - Sakshi

ఎలాంటి అంచనాలు లేకుండ విడుదలైన కన్నడ చిత్రం కాంతార సంచలన విజయం సాధించింది. మొదట కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కన్నడతో పాటు తెలుగ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రికార్ట్‌ కలెక్షన్స్‌ రాబడుతోంది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా నేషనల్‌ స్టార్‌గా గుర్తింపు పొందాడు హీరో రిషబ్‌ శెట్టి.  ఈ మూవీకి ఆయనే దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

చదవండి: సిద్దార్థ్‌, అదితిల సీక్రెట్‌ డేటింగ్‌? వైరల్‌గా హీరో పోస్ట్‌

ఈ చిత్రంతో రాత్రికి రాత్రే ఆయన స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు. దీంతో రిషబ్‌ శెట్టి గుగూల్‌ ట్రెండింగ్‌లో నిలిచాడు. ఇదిలా ఉంటే కాంతార మూవీతో కన్నడ కల్చర్‌ను దేశవ్యాప్తంగా పరిచయం చేశాడు రిషబ్ శెట్టి. భూతకోల సంస్కృతిని తెలియజేస్తూ ఈ కథను తెరకెక్కించాడు ఆయన. అయితే తాజాగా బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన రిషబ్‌ శెట్టి మూవీ విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఈ సినిమా చివరిలో ఆయన వేసిన భూతకోల గురించి పలు ఆసక్తిర విషయాల గురించి చర్చించాడు. ఈ సినిమా చివరిలో ఆయన కోల వేసిన సంగతి తెలిసిందే.

చదవండి: ఆసక్తిగా ఊర్వశివో రాక్షసివో ట్రైలర్‌, వెన్నెల కిషోర్‌ కామెడీ మామూలుగా లేదుగా

ఈ సన్నివేశం చేసేటప్పుడు ఆయన దాదాపు 50 నుంచి 60 కిలోల బరువు క్యారీ చేసినట్లు చెప్పాడు. ‘భూతకోల సీక్వెన్స్‌  కోసం షూటింగ్‌ మొదలు 20 నుంచి 30 రోజుల ముందు నుంచి నాన్‌ వేజ్‌ తినడం మానేశా. దైవ కోల వేసినప్పుడు దాదాపు 50 నుంచి 60 కిలోల బరువును క్యారీ చేశాను. కన్నడ ప్రజలు అత్యంత పవిత్రంగా చూసే ఈ దైవ కోల అలంకారణ వేసిన అనంతరం కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నాను. అయితే ఈ కోల సీక్వెన్స్‌ వేయడానికి ముందు ఆ తర్వాత ప్రసాదం ఇచ్చేవారు’ అని రిషబ్‌ చెప్పుకొచ్చాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement