Hero Siddharth Birthday Wishes To Rumoured Girlfriend Aditi Rao Hydari - Sakshi
Sakshi News home page

Siddharth-Aditi Rao Hydari: సిద్దార్థ్‌, అదితిల సీక్రెట్‌ డేటింగ్‌? వైరల్‌గా హీరో పోస్ట్‌

Oct 31 2022 9:52 AM | Updated on Oct 31 2022 10:52 AM

Hero Siddharth Birthday Wishes to Rumoured Girlfriend Aditi Rao Hydari - Sakshi

Siddharth-Aditi Rao Hydari Dating Rumours: హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్‌ అదితి రావ్‌ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్‌ ముందు వీరిద్దరు జంటగా మీడియాకు చిక్కారు. దీంతో అప్పటి నుంచి సిద్ధార్థ్‌, అదితిలు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్‌ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్‌ రూమర్స్‌పై ఈ జంట స్పందించలేదు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా అదితి బర్త్‌డే సందర్భంగా సిద్ధార్థ్‌ చేసిన పోస్ట్‌ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. 

చదవండి: కోలుకోవడం సాధ్యం కాలేదు, బతకాలనిపించలేదు : దీపికా పదుకొణె

అదితితో కలిసి క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే ప్రిన్సెస్‌ ఆఫ్‌ హార్ట్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి ప్రేమాయణం నిజమేనంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదితితో ప్రేమలో ఉన్నట్లు సిద్ధార్థ్‌ ఈ పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చాడా? అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిద్ధార్థ్‌ పోస్ట్‌పై వారి సన్నిహితులు సైతం వీరిద్దరిని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక సిద్దార్థ్ పోస్ట్‌కి అదితి స్పందిస్తూ సిద్దూ… అంటూ స్పెషల్ కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే అదితి బర్త్‌డే సందర్భంగా వీరిద్దరు జంటగా వేకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె బర్త్‌డే రోజున(అక్టోబర్‌ 28న)ముంబై ఎయిరోపోర్ట్‌లో సిద్దార్థ్‌, అదితిలు జంటగా దర్శనం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement