నటుడితో ప్రేమ పెళ్లి.. తల్లి కాబోతున్న హీరోయిన్! | Richa Chadha Announce Pregnancy After Marriage With Actor Ali Fazal, Couple Expecting Their First Baby - Sakshi
Sakshi News home page

Richa Chadha Pregnancy: తల్లి కాబోతున్న హీరోయిన్.. పోస్ట్ వైరల్!

Published Fri, Feb 9 2024 6:36 PM

Richa Chadha Announce Pregnancy After Marriage with Actor - Sakshi

బాలీవుడ్ భామ రిచా చద్దా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది ఫర్కీ-3 సినిమాతో అభిమానులను అలరించింది. పంజాబ్‌కు చెందిన ముద్దుగుమ్మ ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్ అనే మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హీరామండిలో కీలక పాత్రలో కనిపించనుంది. త్వరలోనే ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

అయితే ఫర్కీ నటుడు అలీ ఫైజల్‌తో ప్రేమాయణం కొనసాగించిన రిచా చద్దా(37) 2022లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. 

కాగా.. 2013లో ఫర్కీ సినిమా సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్న వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత పంజాబీ, లక్నో సంప్రదాయంలో ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. పెళ్లి తర్వాత సినీ ప్రముఖుల కోసం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. ఇక సినిమాల విషయాకొనిస్తే.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తెరకెక్కించిన ఒరిజినల్ షో కాల్ మై ఏజెంట్‌లో నటించారు. అంతే కాకుండా గర్ల్స్ విల్ బి గర్ల్స్ చిత్రంతో నిర్మాతలుగా మారారు. ఈ సినిమా సన్‌డాన్స్‌లో రెండు అవార్డులను గెలుచుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement