ఫోటోపై రియాక్ట్‌ అయిన రేణు దేశాయ్‌.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు | Renu Desai Gives Clarity Akira Movies Entry Rumours, After Raghavendra Rao Shared Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Renu Desai On Akira Movies Entry: ఫోటో షేర్‌ చేసిన రాఘవేంద్ర రావు.. రియాక్ట్‌ అయిన రేణుదేశాయ్‌

Published Tue, Aug 22 2023 12:52 PM | Last Updated on Tue, Aug 22 2023 1:35 PM

 Renu Desai Reaction On Raghavendra Rao Share Akira Photo - Sakshi

టాలీవుడ్‌ దర్శకుడు కే రాఘవేంద్ర రావు ఒక ఫోటో షేర్‌ చేశారు. అందులో రేణుదేశాయ్‌- పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకిరా నందన్‌ ఉన్నారు. దీంతో ఆ ఫోటో ఒక్కసారిగా వైర్‌లా కావడం పలు కామెంట్లు వస్తుండటంతో కొంత సమయం తర్వాత రాఘవేంద్ర రావు తన సోషల్‌మీడియా ఖాతా నుంచి తొలగించారు.

ఫోటో సంగతేంటి ..
రాఘవేంద్ర రావు, అతని అల్లుడు శోభు యార్లగడ్డ, దర్శకుడు రాజమౌళి  అందరూ  'బాహుబలి' మ్యూజిక్ సింఫనీ ఉంటే నార్వే వెళ్లారు.  అక్కడ శోభు కుమారుడు, రాఘవేంద్ర రావు మనవుడు అయిన కార్తికేయ , అకిరా నందన్‌తో ఫోటో దిగారు. ఆ ఫోటోను షేర్ చేస్తూ.. ఫోర్త్ జనరేషన్ అఫ్ బాయ్స్ అమెరికాలోని ఫిలిం స్కూల్‌లో జాయిన్ అయ్యారని క్యాప్షన్‌ పెట్టారు. ఇంకేముంది అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు నెట్టింట వైరల్‌ అయింది.

ఫోటోపై స్పందించిన రేణుదేశాయ్‌ 
సోషల్‌ మీడియాలో అకిరా నందన్‌ ఫోటోను షేర్‌ చేస్తూ రేణు దేశాయ్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు నెటిజన్లు. ఈ రూమర్లకు ఆమె ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది. అకిరా ఏ ఫిల్మ్ స్కూల్‌లో జాయిన్ అవ్వలేదని క్లారటీ ఇచ్చింది. ప్రస్తుతం అకిరాకు యాక్టింగ్ మీద అంతగా ఆసక్తి లేదని తెలిపింది. ఇప్పట్లో అతనికి సినిమాల్లో నటించాలనే కోరిక లేదు.  ఒక వేళ అకిరాకు సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి ఉండి నటించాలనే ఆసక్తి కలిగితే  ఆ విషయాన్ని ముందుగా  తానే చెప్తానని  రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. 

(ఇదీ చదవండి: రాజ‌కీయాల్లో చిరు ఓడిపోవ‌చ్చేమో కానీ సినిమాల్లో ఎప్పటికీ 'మగధీరుడే')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement