వ్యాపారవేత్తతో హీరోయిన్‌ 'రెజీనా' పెళ్లి ఫిక్స్‌ | Regina Cassandra Marriage With Businessman Soon, Rumous Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Regina Cassandra Marriage Rumours: వ్యాపారవేత్తతో హీరోయిన్‌ 'రెజీనా' పెళ్లి ఫిక్స్‌

Published Sun, Mar 3 2024 7:56 AM

Regina Cassandra Marry With Businessman - Sakshi

దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా. ముఖ్యంగా తెలుగు, తమిళ్‌ భాషల్లో సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. చెన్నైలో పుట్టి పెరిగిన రెజీనా..  మోడల్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది. టాలీవుడ్‌లో  పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్‌ అయింది.

ఒకప్పడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన రెజీనా ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్‌ సీరీస్‌పై దృష్టి పెట్టింది. వరుసగా వెబ్‌సీరీస్‌ల్లో నటిస్తూ బిజీగా మారింది. ఆపై చిన్ని సినిమాలను కూడా ఒప్పుకుంటుంది. అయితే ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్‌ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్‌ హీరో సందీప్ కిషన్‌తో రెజినా రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని సందీప్‌ చెప్పడంతో అది కాస్త ఆగిపోయింది.

ఆ తర్వాత సాయి ధరమ్ తేజను ఏకంగా పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి.. కొన్నిరోజుల తర్వాత ఓ తమిళ స్టార్‌ హీరోతో సీక్రెట్‌గా రొమాన్స్‌ చేస్తుందని కూడా టాక్‌ వచ్చింది. ఇవన్నీ రూమర్స్‌ అని తర్వాత తేలిపోయింది. కానీ ఆమె మాత్రం ఇలాంటివి ఇండస్ట్రీలో కామనే అనుకుని సమాధానం ఇవ్వకుండా తనపని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది.

సినిమా ఛాన్సులు తగ్గడంతో అందరి హీరోయిన్ల మాదిరే రెజీనా కూడా పెళ్లి పీటలెక్కబోతుందని కోలీవుడ్‌ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఓ బిజినెస్‌మేన్‌ను ఆమె వివాహం చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వారి కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయని అంటున్నారు. త్వరలో ఈ శుభవార్తను రెజీనా ప్రకటించే అవకాశం ఉందని టాక్‌.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ రెజీనా పెళ్లి ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది.

ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్‌గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్‌కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
 
Advertisement