రావణలంకలో పాటలు | Ravana Lanka Movie Audio Launch | Sakshi
Sakshi News home page

రావణలంకలో పాటలు

Sep 6 2020 5:42 AM | Updated on Sep 6 2020 5:42 AM

Ravana Lanka Movie Audio Launch - Sakshi

క్రిష్‌ బండిపల్లి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రావణలంక’. బి.ఎన్‌.ఎస్‌ రాజు దర్శకత్వం వహించారు. కే సిరీస్‌ మూవీ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో అశ్విత, త్రిష కథానాయికలుగా నటించారు. ఉజ్జల్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను డైరెక్టర్‌ వీరశంకర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత క్రిష్‌ బండిపల్లి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను ఎందుకు నువ్వే నిర్మిస్తున్నావని కొందరు స్నేహితులు అడిగారు.

వేరే నిర్మాతల దగ్గరికి వెళితే బడ్జెట్‌ సమస్యలు వస్తాయని నేనే నిర్మించానని చెప్పాను. రాహుల్‌ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ‘‘యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. హిమాలయాల్లో కొన్ని అద్భుతమైన సన్నివేశాలు తీశాం. బ్యాంకాక్, వైజాగ్‌లోనూ చిత్రీకరణ జరిపాం. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తీశారు’’ అన్నారు బి.ఎన్‌.ఎస్‌ రాజు.

Advertisement
 
Advertisement
Advertisement