Rashmika Mandanna Release Padhaa Lyrical Song From Stand Up Rahul Movie - Sakshi
Sakshi News home page

Stand Up Rahul: ర‌ష్మిక చేతుల మీదుగా ప‌ద సాంగ్ రిలీజ్‌

Jan 19 2022 8:10 AM | Updated on Jan 19 2022 11:08 AM

Rashmika Mandanna Release Padhaa Lyrical Song From Stand Up Rahul Movie - Sakshi

జీవితంలో ఏ విషయానికి కూడా స్థిరంగా నిలబడడానికి ఇష్టపడని వ్యక్తి స్టాండప్‌ కమెడియన్‌గా మారతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ..

రాజ్‌ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వంలో నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి నిర్మించారు. ‘పద..’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటను హీరోయిన్‌ రష్మికా మందన్న మంగళవారం విడుదల చేశారు. నలుగురు స్నేహితుల రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది.

స్వీకర్‌ అగస్తి ట్యూన్‌ అందించగా, యాజిన్‌ నిజర్‌ పాడారు. రెహమాన్‌ సాహిత్యం అందించారు. ‘‘జీవితంలో ఏ విషయానికి కూడా స్థిరంగా నిలబడడానికి ఇష్టపడని వ్యక్తి స్టాండప్‌ కమెడియన్‌గా మారతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురయినప్పుడు ఎలా కష్టపడాల్సి వస్తుంది? అన్నదే చిత్రకథ’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సిద్ధు ముద్ద.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement