Rashmika Mandanna Reacts To Rumours Of Her Dating Vijay Devarakonda - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna : రౌడీ హీరోతో డేటింగ్‌పై నోరువిప్పిన రష్మిక

Aug 12 2022 12:56 PM | Updated on Aug 12 2022 1:08 PM

Rashmika Mandanna Reacts To Rumours Of Her Dating Vijay Devarakonda - Sakshi

రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తుంది. రష్మిక కెరీర్‌ ఆరంభం నుంచి ఆమె వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయ్‌ దేవరకొండ- రష్మికలు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు ఫిల్మీ దునియాలో జోరుగా ప్రచారం జరుగుంది. ఇప్పటికే విజయ్‌ ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు.

అయినప్పటికీ వీరి రిలేషన్‌పై గాసిప్స్‌ పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై రష్మిక మందన్నా స్పందించింది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను ఐదు సినిమాలు చేస్తున్నా. వాటి గురించి అడిగితే ఎంతసేపైనా మాట్లాడతా. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోవాలన్ని ఆసక్తి ఉండటం సహజమే.

కానీ పదేపదే అవే ప్రశ్నలు అడగటం ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రేమ, పెళ్లి విషయాల్లో పుకార్లను అస్సలు నమ్మొద్దు. నేను చెప్పేందవరకు ఒక నిర్ణయానికి రాకండి. నా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ చెప్పుకొచ్చింది ఈ నేషనల్‌ క్రష్‌.

Advertisement
 
Advertisement
Advertisement