Rashmika Mandanna to pair with Dhanush for her next? - Sakshi
Sakshi News home page

Rashmika: రష్మికకు సూపర్ ఛాన్స్? ఈసారి ఏకంగా

Jul 26 2023 1:09 AM | Updated on Jul 26 2023 11:36 AM

Rashmika Mandanna opposite Dhanush - Sakshi

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో జోరు మీదున్నారు హీరోయిన్‌ రష్మికా మందన్న. వరుస చాన్స్‌లు అందుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా హీరో ధనుష్‌కి జోడీగా నటించనున్నారని టాక్‌. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గత ఏడాది నవంబరులో ఓ సినిమాకి శ్రీకారం జరిగిన సంగతి తెలిసిందే.

సోనాలి నారంగ్‌ సమర్పణలో సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ధనుష్‌ సరసన రష్మికా మందన్న నటించే చాన్స్‌ ఉందట. ఈ మేరకు చిత్ర యూనిట్‌ ఆమెతో చర్చలు జరుపుతోందని టాక్‌. ఇదే సినిమాలో హీరో నాగార్జున ఓ కీలక పాత్ర చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘పుష్ప 2’, రెయిన్‌ బో’ చిత్రాలతో పాటు హిందీలో ‘యానిమల్‌’ మూవీ చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement