Prime Blunder: Rashmika Mandanna Name as Rashmika Madona in Amazon Prime - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: మారిపోయిన రష్మిక పేరు.. మందన్నా కాదట

Jan 8 2022 8:06 PM | Updated on Jan 8 2022 8:30 PM

Rashmika Mandanna Name As Rashmika Madona In Amazon Prime - Sakshi

Amazon Prime Blunder Rashmika Mandanna Name: నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా వరుస సినిమాలతో ఫుల్‌ బిజి అయిపోయింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది. ‘మిష‌న్ మ‌జ్ను’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. తన క్యూట్‌ క్యూట్‌ హావభావాలతో అ‍ల్లరి చేసే ఈ ముద్దుగుమ్మను గాసిప్స్‌ కూడా వెంటాడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీతో మంచి హిట్‌ కొట్టింది ఈ అమ్మడు. పాన్‌ ఇండియాగా విడుదలైన ఈ చిత్రంలో శ్రీవల్లిగా పుష్పరాజ్‌నే కాకుండా ప్రేక్షకుల మదిని దోచింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక మందన్నా పేరు అది కాదని రష్మిక మడోనా అని సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

పుష్ప ది రైజ్‌ సినిమాను జనవరి 7న ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైన సంగతి విధితమే. ప్రస్తుతం హిందీ తప్ప తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో పుష్ప చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ అమెజాన్‌ చేసిన ఒక చిన్న తప్పు వల్ల రష్మిక అసలు పేరే మారిపోరియింది. పుష్ప సినిమా చివర్లో నటీనటుల పేర్లు వేస్తారని ప్రతీ సినిమా ప్రేక్షకుడుకి తెలుసు. ఆ టైటిల్స్‌లో రష్మిక మందన్నాకు బదులు రష్మిక మడోనా అని తప్పుగా వేశారు. ఇంకేం దీంతో మన నెటిజన్స్‌కు మంచి టాపిక్‌ దొరికినట్టయింది. ఆ పేరును స్క్రీన్‌ షాట్‌ తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ పేరు కాస్తా తెగ వైరల్‌ అవుతోంది. మరీ ఈ పొరపాటును అమెజాన్‌ ఎలా సరిదిద్దుకుంటుందో చూడాలి. అలాగే రష్మిక కూడా ఎలా స్పందిస్తుందో అని తన అభిమానులు ఎదురు చూస్తున్నారు. 



ఇదీ చదవండి: అది ఇది కాదు.. ఎమ్మా వాట్సన్‌కు బదులు మరో హీరోయిన్‌

Advertisement
 
Advertisement
Advertisement