Anchor Rashmi: ఆ వీడియోపై రష్మీ షాకింగ్‌ కామెంట్స్‌, అది ప్రాంక్‌ కాదు.. నిజమే!

Rashmi Gautam And Nandu Exclusive Interview With Sakshi

యాంకర్ రష్మీ ఫోన్‌ ఎత్తదు, మూవీ ప్రమోషన్లకు రాదంటూ ఇటీవల నటుడు నందు ఆమెపై ఫైర్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది చివరకు ప్రాంక్‌ వీడియో అని తేలింది. నందు హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియోను తీసినట్లు చివరిలో నందు పేర్కొన్నాడు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా యాంకర్‌ రష్మి, నందులు సాక్షి టీవీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌కు రష్మి రాదని, కాల్స్‌ కూడా ఎత్తదు అంటూ ప్రాంక్‌ వీడియో తీశారు కదా.. అది ముందుగానే ప్లాన్‌ చేసుకుని తీశారా? లేదా అప్పటికప్పుడు తీశారా? అని యాంకర్‌ ప్రశ్నించారు.

చదవండి: ‘కాంతార’ మూవీపై కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

దీనికి రష్మి స్పందిస్తూ అది నిజమే కానీ దానికి ప్రాంక్‌ వీడియో అని పేరు పెట్టారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. అయితే ఈ వీడియోలో రష్మీ ‘నేను రాను.. నాకు ఈ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదు’అని మొహం మీదే చెప్పేసింది. అది తాను నిజంగానే అన్నానని చెప్పింది. ‘ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రెండేళ్ల తర్వాత విడుదల చేస్తున్నారు. నేను టీవీకి పని చేస్తాను. అప్పటికే నేను కమిట్‌ అయిన ప్రాజెక్ట్స్‌ ఉంటాయి. రెండు రోజులు బిజీ షెడ్యూల్‌ ఉంది. నాకు ఒక 2 లేదా 3 రోజులు టైం ఇవ్వమని చెప్పాను.

చదవండి: ఓటీటీకి వచ్చేసిన బింబిసార, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌

అయిన వారు వినకుండా ప్రమోషన్స్‌ ఉన్నాయి రా అంటూ పదే పదే కాల్‌, మెసేజ్‌లు చేస్తున్నారు. అందుకే చిరాకు వచ్చి కాల్స్‌కి సమాధానం ఇవ్వలేదు. దీంతో నేను చేస్తున్న షూటింగ్‌ స్పాట్‌కే వచ్చి నన్ను డిస్టర్బ్‌ చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అందుకే అలా అనేశాను’ అని తెలిపింది. కాగా ప్రమోషన్స్‌ ఎందుకు రావని నందే ప్రశ్నించగా.. అక్కడ నాకు రకరకాల ప్రశ్నలు ఎదురువుతాయిని, వాటికి తాను సమాధానాలు చెప్పలేనని.. అందుకే నేను ప్రమోషన్స్ కు రానంటూ రష్మీ ప్రాంక్‌ వీడియోలో ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top