-
సుధీర్‌ను పిలవాల్సిన అవసరం నాకు లేదు : రష్మి గౌతమ్
బుల్లితెరపై సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కెమిస్ట్రీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రీల్ కపుల్‌గానే కాకుండా సుధీర్-రష్మి రియల్ కపుల్ అయితే బావుండు అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్ చేస్తారు ఈ జంట. ఈ క్రమంలో వీరిద్దరు లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రష్మి గౌతమ్ స్పందించింది. సుధీర్‌కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్ విషయం. ప్రతి విషయాన్ని బయటకు చెప్పుకుంటూ పోతే ఇంక పర్సనల్ ఏమీ ఉండదన్నది నా అభిప్రాయం అని తెలిపింది. ఇక తాను నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుధీర్‌ను మీరే గెస్ట్‌గా పిలిచారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. నేను సుధీర్‌ను పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పిలవకపోయినా అతడు వస్తాడు. మా మధ్య అలాంటి స్నేహం ఉంది. ఈవెంట్ ఉందని తనకి తెలుసు. నేను పిలవకపోయినా సుధీర్ వస్తాడన్న నమ్మకం నాకుంది. అందుకే నేను పిలవలేదు, నందు గెస్టుగా పిలిచాడు అంటూ చెప్పుకొచ్చింది. -
‘బొమ్మ బ్లాక్ బస్టర్’ రివ్యూ
టైటిల్ : బొమ్మ బ్లాక్‌బస్టర్ నటీనటులు: నందు, రష్మీ గౌతమ్, కిరీటి, దామరాజు, రఘు కుంచె తదితరులు నిర్మాణ సంస్థ: విజయీభవ ఆర్ట్స్ నిర్మాతలు: ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ దర్శకత్వం : రాజ్ విరాట్ సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్ ఎడిటర్ : బి. సుభాష్కర్ కథేంటంటే... పోతురాజు(నందు) ఒక మత్స్యకారుడు. పూరీ జగన్నాథ్‌కి వీరాభిమాని. తాను కూడా పూరీ లాగా పెద్ద దర్శకుడు కావాలని కలలు కంటాడు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో సినిమా తీసి హిట్ కొట్టాలనుకుంటాడు. సినిమాలపై పిచ్చితో ఏ పని చేయకుండా ఊర్లో అల్లర చిల్లరగా తిరుగుతూ.. వాణి(రష్మీ గౌతమ్)తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం అందరితో గొడవలు కూడా పడుతుంటాడు. కట్ చేస్తే.. అనూహ్యంగా పోతురాజు తండ్రి హత్య చేయబడతాడు. ఆ తర్వాత పోతురాజ్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? పోతురాజు తండ్రిని హత్య చేసిందెవరు? వాణితో లవ్ స్టోరీ ఏమైంది? చివరికి తన సినిమా లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా?అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన దర్శకుడు రాజ్ విరాట్. గతంలో తాను చేసిన షార్ట్ఫిలిమ్స్ హిట్ కావడంతో.. ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ఆఫర్ వచ్చింది. ఎక్కువగా యాక్షన్ జానర్ లో షార్ట్ ఫిలిమ్స్ చేయడంతో ఇప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీని కూడా అదే జానర్ లో చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై చూపించడంతో కాస్త తడబడ్డాడు. పోతరాజు పాత్ర నేపథ్యం, ఫ్యామిలీ.. సినిమాల పిచ్చి తదితర విషయాలను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. కాసేపటికే కథలోకి వాణి పాత్ర వచ్చేస్తుంది. ఆమెతో పోతురాజు ప్రేమలో పడటం..వాణిని ఇంప్రెస్ చేయడానికి గొడవలు చేయడం..ఇలా సింపుల్‌గా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తిని పెంచుతుంది. పోతరాజు ఫ్యామిలీ గురించి కొన్ని నిజాలు తెలియడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. అయితే సెకండాఫ్‌లో కూడా కథ ఆసక్తికరంగా సాగదు. కొన్ని సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. పలు ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ తో దర్శకుడు మంచి కథనే రాసుకున్నాడు. స్క్రీన్ ప్లేని ఇంకా బిగువుగా రాసుకోని ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. గతంలో అనేక సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసి మెప్పించాడు నందు. హీరోగా మారి ‘సవారీ’ చేశాడు. ఆ సినిమాలో నందు నటనకు అంతా ఫిదా అయ్యారు. హీరో పీస్ అని మెచ్చుకున్నారు. ‘బొమ్మ బ్లాకబస్టర్’లో కూడా నందు మంచి నటనను కనబరిచాడు. పోతురాజు పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ లో కూడా బాగానే నటించాడు. వాణి పాత్రకి రష్మీ గౌతమ్ న్యాయం చేసింది. కీరీటీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రశాంత్ విహారి పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ తో మంచి విజువల్స్ చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Bomma Blockbuster: నందు కోసం రష్మీ ఆటోలో తిరిగింది.. మూవీ హిట్ కొట్టాలి
నందు, యాంకర్ రష్మీ హీరోహీరోయిన్లు నటించిన తాజా చిత్రం బొమ్మ బ్లాక్‌బస్టర్. రాజ్ విరాట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రశాంత్ విహారి సంగీతం అందించాడు. ఈ సినిమా వచ్చే నెల 4న విడుదలవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నాగశౌర్య మాట్లాడుతూ.. మంచి కథతో తీసిన ఈ సినిమా ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తుంది. హీరో, హీరోయిన్ లిద్దరూ చాలా బాగా నటించారు . రష్మీ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అలాంటి మంచి పేరున్న తను హీరో నందుకు సపోర్ట్ చేయడానికి ఈ సినిమాకు డబ్బులు తీసుకోకుండా ఆటోలో తిరిగింది అని విన్నాను. తనకు సినిమా పై ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. నందు ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డాడు. మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసిన ఈ సినిమా టైటిల్ మాదిరే బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. రష్మీ ని చూసి ఇస్పైర్ అయిన చాలా మందిలో నేను ఒకణ్ణి, ఆలా అందరూ బాగుండాలని కొరుకొనే తనకు, నందుకు, దర్శక, నిర్మాతలకు చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు. చిత్ర హీరో నందు మాట్లాడుతూ.. నన్ను నమ్మి కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చింది రష్మీ .తనకు ఈ సినిమా షూట్ చేస్తున్న టైమ్ లో తనకు మేము సరైన సదుపాయాలు కల్పించలేక పోయినా తను మాకు ఫుల్ సపోర్ట్ చేసింది. తనకు ఒక్క థ్యాంక్స్ చెపితే సరిపోదు. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసిన మా సినిమా కచ్చితంగా ప్రేక్షకులను నచ్చుతుందని భావిస్తున్నాం’అన్నారు. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!
బాక్సాఫీస్‌కు, ఓటీటీకి ఈ వారం నువ్వానేనా? అన్న రీతిలో పోటీ సాగేట్లు కనిపిస్తోంది. బోలెడన్ని సినిమాలు థియేటర్లో రిలీజయ్యేందుకు క్యూ కట్టగా అటు ఓటీటీలో కూడా సినిమాల జాతర జరగనుంది. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో వచ్చే సినిమాలేంటో చూసేయండి.. లైక్ షేర్ సబ్‌స్క్రైబ్.. సంతోశ్ శోభన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం లైక్ షేర్ సబ్‌స్క్రైబ్. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది. ఊర్వశివో రాక్షసివో.. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో. రాకేశ్ శశి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి అచ్చు రాజమణి సంగీతం అందించారు. ఈ మూవీ కూడా ఈ శుక్రవారం అంటే నవంబర్ 4న రిలీజ్ కానుంది. బొమ్మ బ్లాక్‌బస్టర్ నందు, యాంకర్ రష్మీ హీరోహీరోయిన్లు నటించిన సినిమా బొమ్మ బ్లాక్‌బస్టర్. రాజ్ విరాట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రశాంత్ విహారి సంగీతం అందించాడు. ఈ సినిమా వచ్చే నెల 4న విడుదలవుతోంది. బనారస్ జైద్ ఖాన్, సోనాల్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ బనారస్. జయతీర్థ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కూడా నవంబర్ నాలుగో తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తగ్గేదేలే నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్ గుప్తా తదితరులు ముఖ్య పాత్ర పోషించిన మూవీ తగ్గేదేలే. శ్రీనివాసరాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి చరణ్ అర్జున్ సంగీతం అందించాడు. ఈ చిత్రం నవంబర్ 4న విడుదలవుతోంది. జెట్టి నందిత శ్వేత, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ జెట్టి. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా నాలుగో తేదీన రిలీజవుతోంది. మిలి బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మిలి. ముత్తుకుట్టి జేవియర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇది కూడా ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఓటీటీలో అలరించనున్న చిత్రాలు.. అమెజాన్ ప్రైమ్ వీడియో ► పొన్నియిన్ సెల్వన్ 1 - నవంబర్ 4 ► మై పోలీస్ మ్యాన్ - నవంబర్ 4 ఆహా ► అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే (మూడో ఎపిసోడ్) - నవంబర్ 4 ► పెట్టకాలి- నవంబర్ 4 నెట్‌ఫ్లిక్స్ ► ఇన్సైడ్ మ్యాన్ - అక్టోబర్ 31 ► ది ఘోస్ట్ - నవంబర్ 2 ► కిల్లర్ సాలీ - నవంబర్ 2 ► మేనిఫెస్ట్ 4వ సీజన్(వెబ్ సిరీస్)- నవంబర్ 4 ► ఎనోలా హోమ్స్ 2 - నవంబర్ 4 ► లుకిసిమ్ - నవంబర్ 4 ► దావిద్ - నవంబర్ 4 ► బుల్లెట్ ట్రైన్ - నవంబర్ 5 హాట్‌స్టార్ ► బ్రహ్మాస్త్ర - నవంబర్ 4 సోనీలివ్ ► కాయుమ్ కలవుమ్ - నవంబర్ 4 చదవండి: కాంతారలో ఏముందని ఎగబడుతున్నారు? డైరెక్టర్‌పై ట్రోలింగ్ బిగ్‌బాస్ 6 విన్నర్ నేనే : ఇనయ అనౌన్స్‌మెంట్‌తో పకపకా నవ్విన శ్రీహాన్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement