షూటింగ్‌ గ్యాప్‌లో రాశీ ఖన్నా ఏం చేస్తుందో చూడండి..

See What Rashi Khanna does in between Shoot Gap - Sakshi

షాట్‌ గ్యాప్‌లో న్యాప్‌ (చిన్న కునుకు) తీస్తూ, విహారయాత్ర కోసం రాశీ ఖన్నా కల కంటున్నారు. ఈ మధ్యకాలంలో హాలిడే ట్రిప్‌ వెళ్లే వీలు దొరకలేదు ఈ బ్యూటీకి. ఎందుకంటే నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’ చిత్రాల కోసం హైదరాబాద్, కార్తీ ‘సర్దార్‌’, ధనుష్‌ ‘తిరుచిత్రంబలమ్‌’ల కోసం చెన్నై, షాహిద్‌ కపూర్‌ ‘సన్నీ’, అజయ్‌ దేవగన్‌ (రుద్ర) వెబ్‌ సిరీస్‌ల కోసం ముంబై.... ఇలా మూడు నగరాలను చుట్టేస్తున్నారామె.

ప్రస్తుతం ‘తిరుచిత్రంబలమ్‌’ కోసం చెన్నైలో ఉన్నారు. ఈ షూట్‌లో షాట్‌ గ్యాప్‌లో హాయిగా కునుకు తీశారు. ‘‘షాట్‌ గ్యాప్‌లో కాస్త టైమ్‌ దొరకడంతో నిద్రపోతున్నాను. ఈ నిద్రలో నా వెకేషన్‌ (విహారయాత్ర) ఎలా ఉండాలో కల కంటున్నాను’’ అన్నారు రాశీ.  వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంటున్న రాశీ ఓ వెకే షన్‌ను కోరుకోవడం కరెక్టే కదా!

చదవండి : ప్యాన్‌ ఇండియా సినిమాలకు మమ్మల్ని పిలవరు: :పృథ్వీ
‘కొండపొలం’ ఫస్ట్‌ సాంగ్‌.. ఆకట్టుకున్న వైష్ణవ్‌, రకుల్‌ లవ్‌ ట్రాక్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top