Rani Mukerji Reveals She Had A Miscarriage In 2020 - Sakshi
Sakshi News home page

Rani Mukerji: రెండోసారి ప్రెగ్నెంట్‌ అయ్యా.. ఆ ఆనందం ఎంతోకాలం ఉండలేదు.. హీరోయిన్‌ ఎమోషనల్‌

Aug 11 2023 2:11 PM | Updated on Aug 11 2023 2:49 PM

Rani Mukerji reveals she had a miscarriage in 2020 - Sakshi

నా బిడ్డను కోల్పోయిన 10 రోజులకే నిర్మాత నిఖిల్‌ అద్వానీ నాకు ఫోన్‌ చేశాడు. డైరెక్టర్‌ చెప్పిన కథను నాకు వినిపించాడు. నాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కానీ ఏదైనా తీవ్రమైన బాధలో ఉన్నప్పుడే దాని నుంచి బయటవేసేందుకు ఇలాంటి మంచి సినిమా ఆఫర్‌ వ

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రాణీ ముఖర్జీ తన జీవితంలోని చేదు అనుభవాన్ని పంచుకుంది. కోవిడ్‌ సమయంలో కడుపులో బిడ్డను పోగొట్టుకున్నానని వెల్లడించింది. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ కార్యక్రమంలో ఆమె ఈ విషాదవార్తను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. 'ఈ విషయాన్ని బయటకు చెప్పడం ఇదే మొదటిసారి. ఈ రోజుల్లో జీవితంలోని ప్రతి విషయాన్ని పబ్లిక్‌గా చెప్తుంటే సినిమా ప్రమోషన్స్‌కోసమేనని విమర్శలు చేస్తున్నారు. అందుకే నా సినిమా ప్రమోషన్స్‌ చేసేటప్పుడు నా వ్యక్తిగత విషయాల గురించి నేనెక్కువగా మాట్లాడను.

కోవిడ్‌తో ప్రపంచమే అల్లకల్లోలం అవుతున్నప్పుడు నా జీవితంలో కూడా పెను విషాదం చోటు చేసుకుంది. 2020లో నేను రెండోసారి ప్రెగ్నెంట్‌ అయ్యాను. దురదృష్టవశాత్తూ ఐదు నెలలకే బిడ్డను కోల్పోయాను. 2020 చివర్లో ఈ సంఘటన జరిగింది. ఈ విషయం ఎవరికీ తెలియదు. నా బిడ్డను కోల్పోయిన 10 రోజులకే నిర్మాత నిఖిల్‌ అద్వానీ నాకు ఫోన్‌ చేశాడు. డైరెక్టర్‌ చెప్పిన కథను నాకు వినిపించాడు. నాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు.

కానీ ఏదైనా తీవ్రమైన బాధలో ఉన్నప్పుడే దాని నుంచి బయటవేసేందుకు ఇలాంటి మంచి సినిమా ఆఫర్‌ వస్తుందేమో అనిపించింది.  మొదట మిసెస్‌ చటర్జీ వర్సెస్‌ నార్వే కథ వినప్పుడు అంత నమ్మకం కుదరలేదు. నార్వేలాంటి దేశంలో ఒక భారతీయ కుటుంబం ఇన్ని ఇబ్బందులు పడుతుందా? అనిపించింది' అని చెప్పుకొచ్చింది. కాగా మిసెస్‌ చటర్జీ వర్సెస్‌ నార్వే చిత్రం అనురూమ్‌, సాగరిక భట్టాచార్య దంపుతల నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

చదవండి: జైలర్‌ రికార్డుల వేట మొదలైంది... తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
అడిగినా సాయం చేయలేదు.. సింధు మరణం తర్వాత కన్నీరు తెప్పించే ఘటన తెరపైకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement