
‘‘మహేశ్‌బాబుకి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన సూపర్ స్టార్’’ అని రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ సినిమా వేడుక (2023)లో మహేశ్ పట్ల తన అభిమానాన్ని వ్యక్తపరిస్తే, ‘‘రణ్‌బీర్ కపూర్‌కి నేను అభిమానిని. ఇండియాలో తను బెస్ట్ యాక్టర్ అన్నది నా అభి్రపాయం’’ అని మహేశ్ పేర్కొన్నారు. అలా ఒకరి పట్ల మరొకరికి ఉన్న అభి్రపాయాన్ని పంచుకున్న ఈ హీరోలిద్దరూ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది.
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి29’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో ఓ శక్తిమంతమైన అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రకు రణ్‌బీర్‌ని ఎంపిక చేయాలని రాజమౌళి అనుకుంటున్నారని టాక్. ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది. ఇక, ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీలో ప్రియాంకా చో్రపా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ పెద్ద అప్‌డేట్ నవంబరులో రానుంది. 2027లో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29’ విడుదలయ్యే అవకాశం ఉంది.