Rana Naidu Teaser: 'రానా నాయుడు' టీజర్ రిలీజ్.. వారిద్దరి కాంబినేషన్ అదుర్స్..!

Rana Naidu Web Series Teaser Released In Netflix Today - Sakshi

టాలీవుడ్‌ హీరో దగ్గబాటి రానా, విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న వెబ్‌సిరీస్ 'రానా నాయుడు'. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. అయితే ఈ వెబ్‌ సిరీస్ ప్రస్తుతానికి హిందీలో మాత్రమే తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లో వీరిద్దరు తండ్రి, కొడుకులుగా నటిస్తున్నారు. హిందీలో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇది అమెరికన్ సిరీస్ 'రే డోనోవన్'కు రీమేక్‌గా వస్తోంది. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న వెబ్‌ సిరీస్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌ పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. 'రానా నాయుడు’ టీజర్‌ని నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  

ముంబై మాఫియా నేపథ్యంలో సన్నివేశాలు వెబ్‌ సిరీస్‌పై ఆసక్తి మరింత పెంచుతున్నాయి. ఎవరికైనా సహాయం కావాలా అన్న రానా వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. అయితే విక్టరీ వెంకటేశ్ రానాకు తండ్రిగా నటిస్తుండగా.. ఇందులో జైలులో ఖైదీగా కనిపించనున్నారు. అయితే ఈ వెబ్‌ సిరీస్‌ తెలుగులోనూ డబ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బాబాయి- అబ్బాయి కాంబినేషన్‌లో రావడంతో దగ్గుబాటి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ టీజర్‌పై పలువురు అభిమానులు కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొందరు టీజర్‌ను తెలుగులో విడుదల చేయాలని కోరుతున్నారు. వెంకటేశ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘కబీ ఈద్ కబీ దివాళి’ అనే సినిమాలో నటిస్తుండగా మరోవైపు.. రానా చేతిలో సైతం పలు సినిమాలు ఉన్నాయి.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top