అర‌ణ్య‌ స్ట్రీమింగ్‌: ఈ అర్ధ‌రాత్రి నుంచే.. | Rana Daggubati Aranya Movie Streams On Zee5 From October 15 | Sakshi
Sakshi News home page

Aranya Movie: ఓటీటీలో అర‌ణ్య‌, స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచంటే?

Oct 14 2021 10:00 PM | Updated on Oct 15 2021 1:14 PM

Rana Daggubati Aranya Movie Streams On Zee5 From October 15 - Sakshi

రానా ద‌గ్గుబాటి, విష్ణు విశాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'అర‌ణ్య‌'. ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏడాది మార్చి 26న విడుద‌లైన ఈ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజ్ అవ‌బోతోంది. ద‌స‌రా కానుకా అక్టోబ‌ర్ 15 నుంచి జీ5లో ప్ర‌సారం కానుంది. దీంతో క‌రోనా కార‌ణంగా థియేట‌ర్‌లో ఈ సినిమా చూడ‌టం మిస్ అయిన‌వాళ్లు నేడు అర్ధ‌రాత్రి నుంచి ఎంచ‌క్కా ఫోన్‌లోనే చూసేయొచ్చు. 

ఇక సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. అడ‌వులు, వ‌న్య‌ప్రాణుల‌ను సంర‌క్షిస్తుంటాడు హీరో. అయితే అట‌వీ శాట మంత్రి 60 ఎక‌రాల అడ‌విని నాశ‌నం చేసి అక్క‌డ డీఆర్‌ఎల్‌ టౌన్‌షిప్‌ని నిర్మించాలని భావిస్తాడు. దీనిని ప్రకృతి ప్రేమికుడు అరణ్య ఏ విధంగా అడ్డుకున్నాడు? అనేదే మిగతా కథ. జోయా హుస్సేన్‌, శ్రీయ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి శాంతను సంగీతం అందించారు.

చ‌ద‌వండి: Aranya Movie Review : రానా ‘అరణ్య’ మూవీ ఎలా ఉందంటే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement